Samsung Mobile: అతి తక్కువ ధరకే శాంసంగ్ గెలాక్సీ స్మార్ట్ ఫోన్.. సేల్స్ మొదలు?

Samsung Mobile: ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ దిగ్గజం శాంసంగ్ మార్కెట్లోకి మరో కొత్త మొబైల్ ను లాంచ్ చేసింది. శాంసంగ్ గెలాక్సీ ఎఫ్04 మోడల్‌ను పరిచయం చేసింది. మరి ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్లు ధర విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఈ శాంసంగ్ గెలాక్సీ ఎఫ్04 స్మార్ట్‌ఫోన్ కి సంబంధించిన సేల్స్ ఈరోజు అనగా జనవరి 12 మధ్యాహ్నం 12 గంటలకు సేల్ ప్రారంభం అయ్యాయి. ఈ స్మార్ట్ ఫోన్ ను ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేయవచ్చు. ఇంట్రడక్టరీ ఆఫర్ కింద రూ.7,499 ధరకే సొంతం చేసుకోవచ్చు. ఆఫర్ ముగిసిన తర్వాత రూ.9,499 ధరకు లభిస్తుంది.

 

జేడ్ పర్పుల్, ఓపల్ గ్రీన్ కలర్స్‌లో కొనొచ్చు. శాంసంగ్ గెలాక్సీ ఎఫ్04 కొనేవారికి ఫ్లిప్‌కార్ట్‌లో బ్యాంక్ ఆఫర్స్ ఉన్నాయి. సిటీ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, ఐసీఐసీఐ బ్యాంక్ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డులతో కొంటే 10 శాతం తగ్గింపు పొందొచ్చు. ఈఎంఐ ఆఫర్ కేవలం రూ.312 నుంచే ప్రారంభం అవుతుంది. ఎక్స్‌ఛేంజ్ ద్వారా కొనేవారికి రూ.8,400 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. కాగా శాంసంగ్ గెలాక్సీ ఎఫ్04 స్మార్ట్‌ఫోన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 6.5 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లే ఉంది. మీడియాటెక్ హీలియో పీ35 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.

 

4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ సపోర్ట్ ఉంది. వర్చువల్ ర్యామ్ ఫీచర్‌తో 8జీబీ వరకు ర్యామ్ పెంచుకోవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. కాగా శాంసంగ్ గెలాక్సీ ఎఫ్04 స్మార్ట్‌ఫోన్ కెమెరా ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇందులో 13మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా 2 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరాతో డ్యూయెల్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 5మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. అలాగే ఈ ఫోన్ 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యంను కలిగి ఉండనుంది. కాగా శాంసంగ్ గత నెలలో రెండు బడ్జెట్ స్మార్ట్‌ఫోన్స్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అవి శాంసంగ్ గెలాక్సీ ఏ04, సాంసంగ్ గెలాక్సీ ఏ04ఇ. గెలాక్సీ ఏ04 ప్రారంభ ధర రూ.11,999 కాగా, సాంసంగ్ గెలాక్సీ ఏ04ఇ ప్రారంభ ధర రూ.9,299 గా ఉంది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -