Sana: సనా సంచలన వ్యాఖ్యలు.. అలా జరిగితే తప్పు ఏంటంటూ?

Sana: సినిమా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లతో పాటు ఇతర నటీనటులకు కూడా మంచి గుర్తింపు లభిస్తుంది. ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ ఆర్టిస్ట్ సనా కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు పొందింది. కొన్ని వందలకు పైగా సినిమాలలో ఎన్నో కీలక పాత్రలలో నటించిన సన ఇప్పటికీ తన నటనా జీవితాన్ని కొనసాగిస్తోంది. ఈమె కేవలం వెండితెరపై మాత్రమే కాకుండా బుల్లితెరపై కూడా పలు సీరియల్స్ లో నటిస్తూ సందడి చేస్తున్నారు

ప్రస్తుతం సన తన పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాలలో మాత్రమే నటిస్తోంది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సనా తన సినీ జీవితం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. అంతేకాకుండా కులాల గురించి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ ఇంటర్వ్యూలో సనా మాట్లాడుతూ తనకు కుల, మతాల గురించి పట్టింపులు లేవని, అన్ని మతాలను నమ్ముతానని తెలిపింది. అంతేకాకుండా తాను ముస్లిం అయినప్పటికీ హిందూ దేవుళ్లను కూడా కొలుస్తానని, కాలినడకన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నానని కూడా వెల్లడించింది.

 

అల్లాని ఏ విధంగా పూజిస్తానో వెంకటేశ్వర స్వామిని, జీసస్ ని కూడా కొలుస్తానని తెలిపింది. అసలు మా అమ్మ ముస్లిమ్, నాన్న క్రిస్టియన్. అలా వారు మతాలకు అతీతంగా ఒకరినొకరు ఇష్టపడే వివాహం చేసుకున్నారు. అలాగే నేను కూడా కులమతాలకు అతీతంగా అన్ని మతాలను గౌరవిస్తాను అంటూ చెప్పుకొచ్చింది. తాను ముస్లిం అయినప్పటికీ హిందూ దేవతల పాత్రలలో కూడా నటించానని తెలిపింది. ప్రస్తుతం మతాల గురించి సనా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 

ఇదిలా ఉండగా తన కెరీర్ గురించి మాట్లాడుతూ.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మాత్రమే కాకుండా హీరోయిన్గా కూడా తనకు ఎన్నో అవకాశాలు వచ్చాయని సనా వెల్లడించింది. అయితే ఎక్స్పోజింగ్ , స్విమ్ సూట్ వేసుకోవటం వంటి కండిషన్స్ పెట్టడం వల్ల ఎన్నో సినిమా అవకాశాలను రిజెక్ట్ చేశానని తెలిపింది. అయితే అలా అవకాశాలు కోల్పోయినా కూడా తాను ఎప్పుడూ బాధ పడలేదని, తాను నటించిన ఎన్నో పాత్రలు తనకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయని తెలిపింది. ఇక నటనకు ప్రాధాన్యత ఉన్న వైవిధ్యమైన పాత్రలతో పాటు ప్రజలకు సందేశాన్ని ఇచ్చే పాత్రలలో నటించటానికి తాను ఎప్పుడూ సిద్ధమేనని తెలిపింది.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -