Pawan-Tarak: పవన్, ఎన్టీఆర్ జాతకాలపై ప్రముఖ జ్యోతిష్కుడు సంచలన వ్యాఖ్యలు!

Pawan-Tarak: సాధారణంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీలు రాజకీయాలలోకి వెళ్లడం సర్వసాధారణం అయితే ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న వారిలో పవన్ కళ్యాణ్ ఇప్పటికే జనసేన పార్టీని స్థాపించి ఎలాగైనా ఎన్నికలలో తన సత్తా నిరూపించుకొని, అధికార పీఠాన్ని అధిష్టించాలని కృషి చేస్తున్నారు. అయితే వచ్చే ఎన్నికల పై పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టారని తెలుస్తోంది. ఎలాగైనా తమ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని పవన్ ఎంతో కృషి చేస్తున్నారు.

ఇకపోతే సీనియర్ ఎన్టీఆర్ స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీ పరిస్థితి ప్రస్తుతం అగమ్య గోచరంగా మారింది. ఈ క్రమంలోనే సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలలోకి వస్తే ఆయన తప్పకుండా ముఖ్యమంత్రి అవుతారని ఆయన తెలుగుదేశం పార్టీ పగ్గాలు అందుకోవాలని చాలామంది ఆకాంక్షిస్తున్నారు. అయితే ఎన్టీఆర్ మాత్రం రాజకీయాలపై ఏమాత్రం ఆసక్తి చూపకుండా సినిమాలతోనే బిజీగా గడుపుతున్నారు.

 

ఇకపోతే మార్చి 22వ తేదీ తెలుగు వారికి ఎంతో ముఖ్యమైనటువంటి ఉగాది పండుగను జరుపుకున్నారు. ఈ ఉగాది పండుగను పురస్కరించుకొని ప్రతి ఒక్కరు పంచాంగ శ్రవణం వినడం, వారి జాతకాలను చూపించుకోవడం వంటివి జరుగుతుంది. ఈ క్రమంలోనే కొత్త సంవత్సరంలో పవన్ కళ్యాణ్ ఎన్టీఆర్ జాతకాల గురించి జ్యోతిష్యులు పలు విషయాలను తెలియచేస్తున్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఎన్టీఆర్ జాతకాల గురించి జ్యోతిష్యులు చెబుతూ…

 

ఎన్టీఆర్ జాతకం ప్రకారం ఆయనకు 2024 డిసెంబర్ 31వ తేదీ వరకు ఆయన జాతకం ఎంతో అద్భుతంగా ఉందని పండితులు తెలియజేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ వృశ్చిక లగ్నం. లగ్నంలో గురుడు ఉండటం వల్ల ఆయన జాతకం ఎంతో అద్భుతంగా ఉందని తెలిపారు. అయితే 2024 నుంచి 2036 వరకు ఆయన తన కెరీర్లో ఒడిదుడుకులు ఉంటాయని తెలిపారు. 2036 తర్వాత ఆయన జాతకం ఎంతో గొప్పగా ఉండబోతుందని ఆయన చేపట్టిన ప్రతి పనిలోనూ సక్సెస్ సాధిస్తారని పండితులు తెలిపారు. ఇక ఈ సమయంలో ఆయన ముఖ్యమంత్రి అయిన ఆశ్చర్య పోవాల్సిన పని లేదంటూ తెలిపారు.

 

ఇక పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ ఈయన ఈసారి సీఎం కాలేరని తెలిపారు. పవన్ కళ్యాణ్ సెప్టెంబర్ 2 1976లో జన్మించారు. ఈయనది కర్కాటక లగ్నం లగ్నంలో కుజుడు గురుడు శుక్రుడు ఉన్నారు. ప్రస్తుతం ఈయనకు శుక్ర మహాదశ నడుస్తుందని ఇది 2024నవంబర్ వరకు ఉంది అయితే ఎన్నికలు 2024 మేలో జరుగుతాయి కనుక ఈయన ఈసారి సీఎం కాలేరంటూ ప్రముఖ జ్యోతిష్యులు పవన్ కళ్యాణ్ ఎన్టీఆర్ జాతకాలను చెబుతూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -