Viral Video: ఆకలి తీర్చుకొనేందుకు జడివానలో ఓ వృద్ధుడు ఏం చేశాడో తెలుసా?

Viral Video: కడుపు నింపుకునేందుకు మనిషి నానా పాట్లు పడుతుంటాడు. ఫుట్‌పాత్‌లపై అర్ధాకలితో అలమటిస్తు ఒక్క పూట అన్నం కోసం రాత్రింబళ్లు కష్టపడుతుంటారు. అలాంటి వారికి బాటసారులు, వాహనదారులు అన్నం ప్యాకెట్లు ఇస్తుంటారు. వాటితోనే వారు కడుపు నింపుకుంటుంటారు. ఎవరో ఇచ్చిన అన్నం అనుకోకుండా నేలపాలు అయితే ఆ బాధ వేరుగా ఉంటుంది. ఓ వృద్ధుడు తింటుంగా విపరీతైన గాలి, వానా రావడంతో ఆ భోజనం ఎక్కడ తడిసిపోయి నీటి పాలు అవుతుందో అని పడిన పాట్లు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఈ వీడియో చూసిన వాళ్లంతా కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.

విపరీతమైన గాలి, భారీగా కురుస్తున్న వర్షంలో ఓ వృద్ధుడు అన్నం వర్షంలో తడవకుండా అక్కడ ఆగి ఉన్న స్కూటీ కింద పెట్టుకుని తింటున్న వీడియో అందరినీ కలిచివేస్తోంది. ‘జిందగి గుల్జార్‌ హై’ అనే పేజ్‌ ట్విట్టర్‌లో ఈ వీడియోను షేర్‌ చేసింది. ఓ జీవితమా.. నీ మీద నాకెన్నో ఫిర్యాదులున్నా ఈ సన్నివేశం చూడగానే వాటన్నింటినీ వదిలేశానని ఇచ్చిన పోస్ట్‌ క్యాప్షన్‌ చూసిన ప్రతి ఒక్కరినీ ఏడిపిస్తోంది. ఇది చాలా బాధాకరం. దీన్ని వర్ణించేందుకు మాటల్లేవ్‌ అని ఓ యూజర్‌ కామెంట్‌ చేయగా ఆకలి ఎంత కిరాతకమైందో అని మరో నెటిజనల్‌ చేసిన కామెంట్‌లో కన్నీళ్లు చెమ్మగిల్లిపోతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -