Krishna: 7వ తరగతి విద్యార్థికి 30 ఏళ్ల వ్యక్తితో పెళ్లి.. గర్భం దాల్చడంతో..

Krishna: బాల్య వివాహాలు రూపుమాపేందుకు ప్రభుత్వాలు ఎంత కఠినమైన చర్యలు తీసుకుంటున్నా కొన్ని చోట్ల ఇంకా జరుగుతున్నాయి. కొంతమంది వయస్సును చూడకుండా తమ కూతురిపెళ్లి చేసేస్తే ఓ పని అయిపోతుందని భావించి చిన్న వయస్సులోనే పెళ్లిళ్లు చేస్తుంటారు. వారి తప్పిదం వల్ల అతి చిన్న వయస్సులోనే పెళ్లి చేసుకుని ఎలాంటి అవగాహన లేకపోవడంతో ఇబ్బందులక గురవుతుంటారు. మరికొందరు అటు అమ్మనాన్నలకు చెప్పలేక.. ఇటు అత్తింటి బాధ భరించలేక ఆత్మహత్యలకు దారి తీస్తోంది. చిన్న వయస్సులోనే పెళ్లి చేయడంతో అనారోగ్యాలకు గురై ప్రాణాలు సైతం పోగొట్టుకుంటున్నారు. ఇదే తరహా ఓ ఘటన కృష్ణా జిల్లాలో చోటు చేసుకుంది. అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..

కృష్ణాజిల్లా చల్లపల్లి మండలంలోని పురిటిగట్టకు చెందిన ఓ మహిళ తన ఏడవ తరగతి చదవుతున్న తన కూతురిని 30 ఏళ్ల వ్యక్తితో వివాహం జరిపించింది. వివాహం సమయంలో సదరు బాలికి చేసుకోనని ఎంత మొత్తుకున్నా ఆ తల్లి కనికరించకుండా పెళ్లి చేసేసింది. కొన్ని నెలల తర్వాత ఆ బాలిక గర్భం దాల్చింది. శారీరకంగా పూర్తిగా ఎదుగుదల లేని బాలిక గర్భం దాల్చడంతో రోజు రోజుకు అనారోగ్యానికి గురైతూ వచ్చింది. నెలల పెరిగే కొద్ది ఆ అమ్మాయి ఆరోగ్యం మరింతా క్షీణిస్తూ వచ్చింది.

15 రోజుల ఆ బాలిక మరింత అనారోగ్యానికి గురవడంతో ఆస్పత్రికి వెళ్లింది. అక్కడ పరీక్షించిన వైద్యులు గర్భం ఉన్న శిశువు మృతి చెందినట్లు గుర్తించారు. రెండ్రోజుల తర్వాత ఆ బాలిక కూడా తీవ్ర అస్వస్థతకు గురై మృత్యువాత పడింది. అయితే.. ఈ విషయం బంధువులు, గ్రామస్తులకు తెలియకుండా అంత్యక్రియాలు పూర్తి చేశారు. ఈ విషయం సోషల్‌ మీడియాలో రావడంతో ఆ తల్లిపై నెటిజన్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -