Viral: 30 ఏళ్ల చిన్న వ్యక్తిని పెళ్లాడిన యువతి.. అసలేమైందంటే?

Viral: సాధారణంగా అమ్మాయి పుట్టింది అంటే తల్లిదండ్రులకు ఓ పెద్ద భారంగా భావిస్తూ ఉంటారు. ఇప్పటికి అన్ని రంగాలలో అమ్మాయిలు ముందడుగు వేస్తున్నప్పటికీ ఆడపిల్ల అంటే భారంగా చూస్తున్నటువంటి తల్లిదండ్రులు ఉన్నారనే చెప్పాలి.ఇక చాలామంది అమ్మాయి పుట్టిందంటే మహాలక్ష్మి పుట్టిందన్న ఆనందంలో తమ కూతురిని ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటారు. ఎంత అల్లారు ముద్దుగా పెంచుకున్న చివరికి అమ్మాయిని ఒకరి చేతిలో పెట్టాల్సి ఉంటుంది.

ఇలా తమ అమ్మాయికి పెళ్లి చేయాలంటే తల్లిదండ్రులు వరుడి కుటుంబంలో ఎన్నో విషయాలను తెలుసుకొని వారితో పెళ్లి నిశ్చయిస్తారు అబ్బాయిలు కూడా అమ్మాయిలు అన్ని విధాలుగా అందంగా ఉంటేనే పెళ్లికి ఒప్పుకుంటున్నారు అలాంటిది ఒక అమ్మాయి అంగవైకల్యంతో బాధపడితే చేసుకోవడానికి ఎవరు కూడా ముందుకు రారు.ఇలా అంగవైకల్యంతో బాధపడేవారు పెళ్లి ఆలోచనలు కూడా మానుకొని ఒంటరిగా జీవితం గడుపుతూ ఉంటారు అలాంటి జీవితాన్ని గడుపుతున్నారు రాజస్థాన్ కి చెందిన వినీత అనే 25 సంవత్సరాల యువతి.

 

దౌసా జిల్లాల లాల్సోట్ అసెంబ్లీ నియోజకవర్గంలోని బాస్ గ్రామానికి చెందిన వినీత వికలాంగురాలు. అంగ వైకల్యంగా ఉండటంతో ఈమె లేచి నడవలేదు అయితే తనకు పెళ్లి చేయాలని తల తల్లిదండ్రులు ఎన్నో సంబంధాలు తెచ్చినప్పటికీ ఆమె అంగవైకల్యమే ఆమెకు అడ్డుగా మారింది. దీంతో పెళ్లి పై ఆశలు వదులుకున్న వినీతకు ఓ సంబంధం వచ్చింది. బల్లు అలియాస్ బలరామ్ అనే వ్యక్తి నుంచి వినీతను పెళ్లి చేసుకోవడానికి ప్రతిపాదన రావడంతో తప్పనిసరి పరిస్థితులలో అతనికి పెళ్లి చేశారు.

 

అయితే బలరాం వయసు ఏకంగా 55 సంవత్సరాలు కావడం గమనర్హం.వినీత జీవితంలో ఒంటరిగా గడపడం ఇష్టం లేనటువంటి తల్లిదండ్రులతో ఎలాగైనా పెళ్లి చేయాలని సంబంధాలు చూసారు. అయితే అంగవైకల్యం కారణంగా తనకు ఎలాంటి సంబంధాలు రాలేదు.ఈ క్రమంలోనే 55 సంవత్సరాల వ్యక్తి నుంచి పెళ్లి ప్రతిపాదన రావడంతో తప్పనిసరి పరిస్థితులలో తనకు ఓ తోడు కావాలని వినీత55 సంవత్సరాల వ్యక్తితో పెళ్లికి సిద్ధమైంది ఇలా తనకన్నా వయసులో 30 సంవత్సరాలు పెద్దవాడైనటువంటి వ్యక్తిని పెళ్లి చేసుకోవడంతో ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Related Articles

ట్రేండింగ్

Judges Trolling Case: జడ్జి హిమబిందుని అవమానించేలా పోస్టు పెట్టిన ‍వ్యక్తి అరెస్ట్‌.. ఆ వ్యక్తి ఎవరంటే?

Judges Trolling Case: చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్ స్కామ్ లో భాగంగా సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ అరెస్టు అయిన విషయం మనకు తెలిసిందే. నంద్యాలలో సిఐడి అధికారులు చంద్రబాబు నాయుడుని అదుపులోకి...
- Advertisement -
- Advertisement -