Assembly Polls: ఆ నియోజకవర్గంలో ఒకసారి ఓడితే మళ్లీ గెలవలేరట.. ఆ డివిజన్ ప్రత్యేకత ఏంటో తెలుసా?

Assembly Polls:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలోనే నామినేషన్స్ కూడా భారీ స్థాయిలో దాఖలు చేస్తున్నారు. నామినేషన్ ప్రక్రియ మొదలవడంతో ఇప్పటికే అన్ని పార్టీ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేస్తూ పార్టీ ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేశారు. సినిమాలలో సెంటిమెంట్లు ఉన్నట్లే రాజకీయాలలో కూడా కొన్ని సెంటిమెంట్ లు ఉంటాయని చెప్పాలి. కొన్ని నియోజకవర్గాలలో ఈ సెంటిమెంట్ లు తరచూ రిపీట్ అవుతూనే ఉన్నాయి. కొన్ని నియోజకవర్గాలలో ఏ పార్టీ అయితే గెలుపొందుతుందో అదే పార్టీ అధికారంలోకి వస్తుందన్న సెంటిమెంట్లు కూడా ఉన్నాయి.

అనంతపురం జిల్లా సింగనమలలో ఈ సెంటిమెంట్ గత కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతూ వస్తుంది. సింగనమల నియోజకవర్గంలో ఏ పార్టీ అయితే గెలుపొందుతుందో అధికారంలో అదే పార్టీ వస్తుంది. అలాగే ఓ నియోజకవర్గంలో కూడా ఒకసారి గెలిచిన అభ్యర్థులు ఎన్నిసార్లు పోటీ చేసిన గెలవరు ఈ సెంటిమెంట్ కూడా అక్కడ రిపీట్ అవుతూ వస్తుంది.

అనకాపల్లి జిల్లా పాకాయరావుపేట నియోజకవర్గం లో ఒక అభ్యర్థి ఒకసారి పోటీ చేసి గెలుపొందితే తిరిగి ఆ అభ్యర్థి ఎన్నిసార్లు ఎన్నికలలో నిలబడిన గెలవరు ఇలాంటి సెంటిమెంట్ పాకాయరావుపేట నియోజకవర్గంలో కొనసాగుతోంది. ఈ తరుణంలోనే ఈసారి కూడా ఇక్కడ అదే సెంటిమెంట్ రిపీట్ కాబోతుందా అన్న ఆందోళనలో పార్టీ నేతలు ఉన్నారు. ఇక 2024 ఎన్నికలలో భాగంగా టిడిపి పార్టీ నుంచి వంగలపూడి అనిత పోటీ చేస్తున్నారు. అలాగే వైసిపి నుంచి కంబాల జోగులు బరిలో దిగారు.

కంబాల జోగులు 2004లో పాలకొండ, 2014 ఎన్నికల్లో రాజాం నుంచి, 2019లో కూడా రాజాం నుంచి పోటీచేసి మొత్తం మూడుసార్లు అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. ఈ ఎన్నికల్లో పాయకరావుపేటకు వైసీపీ హైకమాండ్ ట్రాన్స్‌ఫర్ చేసింది. దీంతో మూడుసార్లు గెలిచిన ఈయన మొదటిసారి పాకాయరావుపేట నుంచి పోటీ చేస్తున్నారు. మరోవైపు అనిత 2014 ఎన్నికల్లో ఇక్కడ్నుంచి 2,828 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మరి రెండోసారి పోటీ చేస్తున్నటువంటి అనిత ఈసారి గెలుస్తుందా లేకపోతే సెంటిమెంట్ ప్రకారం ఓడిపోతుందా అన్న ఆత్రుత నియోజకవర్గ ప్రజలలో ఉంది. మరి ఈసారి ఇక్కడ ఎవరు విజయకేతనం ఎగరవేస్తారో తెలియాల్సి ఉంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -