Ys Jagan: సీఎం జగన్ అభిమన్యుడా? కుంభకర్ణుడా? ఆ ప్రశ్నలకు అసలు జవాబులు ఇవే!

Ys Jagan:  ఏపీలో రాజకీయాలు సినిమాలను తలపించేలా, పురాణాలను గుర్తుచేసేలా ఉన్నాయి. ఏపీ రాజకీయాలను చూసి కొందరు మహాభారతాన్ని ఉదాహరణగా తీసుకుంటుంటే, మరికొందరు రామాయణాన్ని ఉదాహరణగా తీసుకుంటున్నారు. అయితే కూటమి విధించే పద్మవ్యూహంలో చిక్కుకోవడానికి నేను అభిమన్యుడిని కాదు అర్జునుడిని అంటూ జగన్ తనకు తానే జాకీలు లేపుకుంటుంటే, జగన్ అర్జునుడు కాదు ఏపీ పాలిట శికండి అంటూ టీడీపీ, జనసేనలు వాదిస్తున్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైస్ షర్మిల మాత్రం జగన్ కుంభ కర్ణుడు లాంటి వాడు అంటూ నొక్కి వక్కాణిస్తున్నారు. అయితే వైసీపీ చెపుతున్నట్టు జగన్ అర్జునుడా? లేక అభిమన్యుడా? అనే ప్రశ్నకు సమాధానం వెతకడం కష్టం కానీ షర్మిల చెపుతున్నట్టు జగన్ కుంభకర్ణుడా అంటే దానికి మాత్రం ఇట్టే సమాధానం దొరుకుతుంది.

వైసీపీ అధికారంలోకి వచ్చి దాదాపు ఐదేళ్లు పూర్తి కావస్తుంది. అయితే ఈ ఐదేళ్లలో ఎన్నికల నోటిఫికేషన్ రాకముందు వరకు పరదాలు లేకుండా జగన్ ప్రజాక్షేత్రం లోకి వచ్చిన సందర్భాలు వేళ్ళ మీద లెక్క పెట్టవచ్చు. అలాగే తన పార్టీ నేతలకు అందుబాటులోకి వచ్చింది, వారి సమస్యలకు పరిష్కారాలు చూపింది కూడా అదే సంఖ్యలో ఉండవచ్చు. అప్పటి వరకు ప్యాలస్ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ ఎన్నికలు వచ్చే నాటికి ప్రజల ముఖ్యమంత్రిగా రూపాంతరం చెందారని చెప్పాలి. అయితే గత ఎన్నికల సమయంలో అప్పటి ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టి రాజకీయ ప్రయోజనాన్ని పొందిన రెండు కేసుల విషయంలోనూ ఈ ఐదేళ్లల్లో జగన్ ఎన్నడూ నోరు విప్పి ప్రజలకు సమాధానం చెప్పలేదు సరికదా నాడు చేసిన విమర్శల పైన కూడా కట్టుబడలేదు.

మౌనమే తన సమాధానం అంటూ ఇన్నాళ్లుగా కోడికట్టి కేసులో విచారను హాజరుకాలేదు. అలాగే వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న అవినాష్ రెడ్డి పై సిబిఐ నీడ కూడా పడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు అనే అపవాదును మూటకట్టుకున్నారు. రాష్ట్రంలో అందుబాటులో ఉన్న కల్తీ మద్యం బారిన పడి వందలాది మంది ప్రాణాలు అమాయకులు కోల్పోయారు. దాని పైన కూడా జగన్ ఏనాడూ స్పందించలేదు. అలాగే అధికారంలోకి వచ్చిన ఈ ఐదేళ్లలో ప్రజాసమస్యల పై ఒక్కనాడు కూడా ప్రెస్ మీట్ నిర్వహించలేకపోయిన జగన్ నిజంగా కుంభకర్ణుడేనా? ఇసుక పాలిసీ మార్పు అంటూ వైసీపీ ప్రభుత్వం చేసిన ఆలస్యానికి వేలమంది భవన నిర్మాణ కార్మికులు ఆకలి చావులకు బలయ్యారు. అప్పుడు కూడా జగన్ మోనంగానే ఉన్నారు. మూడు రాజధానుల పేరుతో జగన్ మొదలు పెట్టిన మూడు ముక్కలాటకు నిరసనగా రాజధాని కోసం భూములిచ్చిన అమరావతి రైతు కుటుంబాలు తమకు నాయ్యం చేయమంటూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు సుమారు ఐదేళ్లపాటు రోడ్లమీదే కాలం గడిపారు.

అయినా ఏనాడూ ముఖ్యమంత్రిగా జగన్ వారి సమస్య మీద స్పందించలేదు, వారికి ఒక పరిష్కారం చూపించలేదు. అలాగే తన తన తండ్రి హత్యకు న్యాయం కావాలంటూ, తన ప్రాణానికి భద్రత ఇవ్వాలంటూ ఐదేళ్ల నుంచి కోర్టుల చుట్టూ తిరుగుతున్న సునీత గోడు వినే నాధుడే లేకుండా పోయాడు. జాబ్ క్యాలెండరు కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూసిన నిరుద్యోగుల ఎదురు చూపులు ఈ ఐదేళ్ల వైసీపీ పాలనలో ఆవిరైపోయాయనే చెప్పాలి. అయితే ప్రస్తుతం వైసీపీ విధానాన్ని బట్టి చూస్తుంటే షర్మిల చెప్పినట్టు జగన్ కుంభకర్ణుడే అనే వాదన బలపడుతుంది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: షర్మిలకు డిపాజిట్ రాదట.. బాధగా ఉందట.. జగన్ మొసలి కన్నీరు వెనుక లెక్కలివేనా?

CM Jagan: రాజకీయాలు కుటుంబ సభ్యులను సైతం బద్ధ శత్రువులుగా మారుస్తుందని విషయం మరొకసారి రుజువయింది. ఒకప్పుడు అన్యోన్యంగా ఉన్న వైఎస్ కుటుంబం ఇప్పుడు బద్ధ శత్రువులుగా మారిపోయి బహిరంగంగానే ఒకరిని ఒకరు...
- Advertisement -
- Advertisement -