Salaar Fans: సలార్ పై ఆశలు పెట్టుకున్న ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్.. సలార్ విషయంలో ఇలా జరుగుతోందా?

Salaar Fans: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం ప్రశాంత్ దర్శకత్వంలో నటిస్తున్నటువంటి సలార్ సినిమా పైనే ప్రభాస్ అభిమానులు అందరూ కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన ఏ సినిమా కూడా పెద్దగా సక్సెస్ కాకపోవడంతో ప్రభాస్ అభిమానులు ఎంతో నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే అభిమానులు అంచనాలన్నీ కూడా ఈ సినిమా పైన పెట్టుకున్నారు.

ఈ సినిమా సెప్టెంబర్ 28వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ఇంకా చిత్ర బృందం ఈ సినిమా విషయంలో మౌనం వహించడంతో అభిమానులు కాస్త కంగారు పడుతున్నారు. కే జి ఎఫ్ అంటే బ్లాక్ బస్టర్ సినిమాకు దర్శకత్వం వహించిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కేజిఎఫ్ నిర్మాణ సంస్థ నేర్పించిన ఈ సినిమాకు ఎలాంటి హడావుడి లేకపోవడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. కే జి ఎఫ్ సినిమా విషయంలో సదరు నిర్మాణ సంస్థ చేసిన హడావిడి మాములుగా లేదు.

 

ఇక సలార్ విషయానికి వచ్చేసరికి మేకర్స్ మౌనం వహిస్తుండడంతో అభిమానులు కాస్త ఆందోళన చెందుతున్నారు. ఇక ఈ సినిమా నుంచి ఎలాంటి పాటలు కూడా ఇప్పటివరకు విడుదల కాలేదు అయితే ఇందులో ఒక పాట మాత్రం మదర్ సెంటిమెంట్తో ప్రేక్షకుల ముందుకు రానుందని మిగిలిన రెండు పాటలు బ్యాగ్రౌండ్ స్కోర్ టైప్లో వస్తుంటాయని తెలుస్తోంది.అయితే ఎన్ని పాటలు ఉన్న వాటికంటూ విడుదల చేయడానికి కొన్ని ప్లాన్స్ ఉంటాయి కథ అలానే విడుదల చేయాలి కదా అంటూ సందేహాలు వ్యక్తపరుస్తున్నారు.

 

అయితే తాజాగా ఈ సినిమా గురించి సంబంధించిన వార్త వైరల్ గా మారింది. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను మొదలు పెట్టబోతున్నారని అయితే ఇందులో భాగంగా సినిమా నుంచి ఎలాంటి పాటలు విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ లేరని తెలుస్తోంది. ఇలా ఈ సినిమా నుంచి పాటలు విడుదల చేయడం లేదనే వార్త తెలియడంతో ఫాన్స్ కాస్త నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు.అయితే ప్రభాస్ అభిమానులు మాత్రం ఈ సినిమా పైనే ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. మరి ప్రశాంత్ వారి అంచనాలకు తగ్గట్టుగా అనే సినిమాని తీసుకువస్తారా లేదా అన్న ఆత్రుత అందరిలోనూ నెలకొంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -