Prabhas Fans: విసుగు చెందిన ప్రభాస్ అభిమానులు.. ఇప్పటికైనా ఇస్తారా లేదా అని బెదిరిస్తూ?

Prabhas Fans: తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిన ప్రభాస్ ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా ప్రాజెక్టులలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రభాస్ ప్రస్తుతం సలార్, ప్రాజెక్ట్ కే, స్పిరిట్, లాంటి సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నాడు. ఇకపోతే ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమా గత ఏడాది విడుదల అయ్యి ఊహించని విధంగా డిజాస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఇటీవల విడుదల అయిన ఆది పురుష్ సినిమా కూడా మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకుంది.

ఇకపోతే డార్లింగ్ అభిమానులు ప్రస్తుతం అంచనాలు అన్నీ కూడా సలార్ సినిమాపై పెట్టుకున్న విషయం తెలిసిందే. సలార్ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. పాన్ ఇండియా సినిమాగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ మూవీ కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. కాగా గత నెల జూలై 6న రిలీజైన సలార్ టీజర్ యూట్యూబ్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. రెండు రోజుల్లోనే 100 మిలియన్ల వ్యూస్‌ రాబట్టి కొత్త రికార్డు సెట్ క్రియేట్ చేసింది.

 

ఇదే జోష్‌లో ఆగస్టులో ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ రిలీజ్ చేస్తామని కూడా ప్రామిస్ చేశారు మేకర్స్. అయితే ట్రైలర్ కంటే ముందే సలార్ ఫస్ట్ సింగిల్ రిలీజ్‌కు రెడీ అవుతున్నారనే వార్త నెట్టింట వైరల్ అవుతోంది. ఈ విషయంపై అధికారికంగా మాత్రం ఎటువంటి ప్రకటన లేదు. చిత్ర బృందం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో ఫ్యాన్స్ ఇదే విషయాన్ని గుర్తూ చేస్తూ ట్విట్టర్లో #SalaarFirstSingle ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. మరో యాభై రోజుల్లో సలార్ రిలీజ్ కాబోతోంది, ఇప్పటికీ అప్డేట్ లేదు కాబట్టి మాకు ఫస్ట్ సింగిల్ అప్డేట్ కావాలని ట్రెండ్ చేస్తున్నారు. ఇక ఏ క్షణమైనా సలార్ టీమ్ నుంచి సాంగ్ అప్డేట్ రావొచ్చనే న్యూస్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆగష్టు 15న సలార్ ఫస్ట్ సింగిల్ బయటికొచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఈ సినిమాకు కెజిఎఫ్ సిరీస్ ఫేమ్ మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ సంగీతం అందిస్తుండగా సలార్ మ్యూజిక్ ఆల్బమ్ పై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే రవి బస్రూర్ అదిరిపోయే మాస్ ట్యూన్స్ రెడీ చేసినట్లు తెలుస్తోంది. మొత్తంగా చూసుకుంటే ప్రభాస్ అభిమానులు మాత్రం సలార్ సినిమా అప్డేట్ల విషయంలో విసిగిపోయారనే చెప్పవచ్చు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -