Varun Sandesh: వరుణ్ సందేశ్ సినిమాలకు దూరం కావడానికి కారణం ఏంటో తెలుసా?

Varun Sandesh: వరుణ్ సందేశ్ ప్రముఖ తెలుగు సినీ నటుడు. ఇతని విద్యాభ్యాసం అంతా అమెరికాలో కొనసాగింది. తన సహనటి వితికను ప్రేమించి, కుటుంబ సభ్యుల సహకారంతో వివాహం చేసుకున్నాడు. హ్యాపీ డేస్ సినిమా కోసం శేఖర్ కమ్ముల నటన పోటీలు పెట్టినప్పుడు అందులో పాల్గొని హ్యాపీడేస్ చిత్రంలో చందు పాత్ర ద్వారా సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు.

ఈ సినిమా విజయం పొందిన తర్వాత వరుసగా అవకాశాలు రావడం ప్రారంభం అయింది. ఆ తర్వాత వచ్చిన కొత్త బంగారులోకం సినిమా కూడా ఇతనికి మంచి గుర్తింపు తెచ్చి ఇండస్ట్రీలో నిలదొక్కుకునేలా చేసింది. వరుసగా సినిమాల్లో నటిస్తున్న రెండు, మూడు సినిమాలు తప్ప మిగతా సినిమాలు సానుకూల ఫలితాన్ని ఇచ్చాయి.

నటుడుగా వరుణ్ సందేశ్ అనుకునంత సక్సెస్ సాధించలేదు అని చెప్పుకోవచ్చు. వరుణ్ సందేశ్.. యాప్ టీవీ వారు నిర్మించిన హే కృష్ణ అనే వెబ్ సిరీస్ లో కషిష్ వోహ్రా సరసన నటించాడు. ఈయన 2019లో బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ గా వెళ్లి ప్రేక్షకులను అలరించడం జరిగింది.

గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వరుణ్ సందేశ్ కు తన సినిమాలు వరుస పరాజయం కావడంపై అభిప్రాయం ఏంటని ప్రశ్న ఎదురయింది. అందుకు తాను వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అనే క్రమంలోనే ఏమైనా పొరపాటు జరిగి సినిమాలు సక్సెస్ కాకపోయి ఉండొచ్చు అని పేర్కొనడం జరిగింది.

ఇక ఇంటర్వ్యూలో పెళ్లి తర్వాత పిల్లల గురించి ప్లాన్ చేసుకోలేదా అనే ప్రశ్న ఎదురయింది. అందుకు వరుణ్ సందేశ్, వితిక ఈమధ్య ఒక యూట్యూబ్ ఛానల్ ప్రారంభించిందని, ఆ ఛానల్ బాగానే పాపులర్ అయ్యింది అని తెలిపాడు. ఇంకోపక్క కోవిడ్ కూడా ఉండడం చేత ముందు కెరీర్ లో తాను రాణించాలని అందుకే పిల్లల విషయం కాస్త పక్కన పెట్టినట్లు పేర్కొనడం జరిగింది.

ఇక తన సినిమాలు ఎక్కువగా పరాజయం కావడం చేత ప్రస్తుతం సినిమాలకు కాస్త దూరంగా ఉన్నట్లు చెబుతూ, ఏదైనా సినిమా చేయాలంటే ఒకటికి పది సార్లు ఆలోచించి సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారు అనే అవగాహన వచ్చినప్పుడే సినిమాలకు ఓకే చెప్తాను అంటూ ప్రస్తుతం లైఫ్ హ్యాపీగానే ఉందని పేర్కొనడం జరిగింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -