Prabhas: ప్రభాస్ సినిమా రిలీజ్ కోసం అప్పటివరకు ఆగాలా.. ఏమైందంటే?

Prabhas: టాలీవుడ్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తున్న విషయం తెలిసిందే. గత ఏడాది సలార్ సినిమాలో నటించి మెప్పించిన ప్రభాస్ ఈ సినిమాతో మంచి సక్సెస్ ను అందుకున్నారు. ఇప్పుడు అదే ఊపుతో మరికొన్ని సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు. ఇకపోతే ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న మంచి క్రేజ్ ఉన్న సినిమాలలో రాజాసాబ్ కూడా ఒకటి. ఈ సినిమాకు మారుతీ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.

 

కాగా ఈ సినిమాను పీపుల్స్ మీడియా నిర్మిస్తోంది. ఇదే సంస్థ నిర్మించిన ఈగిల్ సినిమా విడుదల సందర్బంగా నిర్మాత విశ్వప్రసాద్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. రాజాసాబ్ సినిమా ఈ ఏడాదే పూర్తవుతుందని ఆ తరువాత సరైన డేట్ చూసి విడుదల చేస్తామని అన్నారు. 2025 సంక్రాంతి బరిలోకి వస్తుందా? అని ప్రశ్నించగా, అప్పటి పరిస్థితులను బట్టి వుంటుందని అన్నారు. అనంతరం పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ.. ఎన్నికల తరువాత వీలును బట్టి, పవన్ కళ్యాణ్ డేట్ లు ఇస్తే సినిమా వుంటుందని అన్నారు.

రాబోయే 15 నెలల్లో కాస్త చెప్పుకో దగ్గర సినిమాలు నాలుగైదు విడుదల అవుతాయని చెప్పారు. మొత్తం ఎప్పటి నుంచో చేస్తున్న 15 సినిమాలు పూర్తి చేసి విడుదల చేయడం కూడా జరుగుతుందన్నారు. ఇకపోతే ఇటీవలె రాజాసాబ్ మూవీ నుంచి ప్రభాస్ కి సంబంధించిన ఒక పోస్టర్ని విడుదల చేసిన విషయం తెలిసిందే.. ఆ పోస్టర్ షేర్ చేసిన కొద్ది క్షణాల్లోనే మిలియన్ల కొద్ది వ్యూస్ ని రాబట్టడంతో పాటు ఆ పోస్ట్ అని ప్రభాస్ అభిమానులు సోషల్ మీడియాలో తెగ వైరల్ చేశారు. ఇంతకుముందు ఎప్పుడూ లేనివిధంగా ప్రభాస్ లుంగీ కట్టుకొని ఒక మాస్ క్యారెక్టర్ లో కనిపించారు. ఆ ఒక్క పోస్టర్ తో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి అని చెప్పవచ్చు. అయితే ఈ సినిమా ఈ ఏడాది విడుదల అవుతుంది అనుకున్న అభిమానులకు తాజాగా నిర్మాత ఒక ఊహించని షాక్ ఇచ్చారని చెప్పాలి.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: ఓటమి భయంతో జగన్ కొత్త ఎత్తుగడలు వేస్తున్నారా.. ఈ ప్లాన్స్ కు అడ్డుకట్ట వేసేదెవరు?

YS Jagan: ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడే కొద్ది ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. సార్వ‌త్రిక ఎన్నిక‌ల వార్ వ‌న్‌సైడ్ గా మారింది. టీడీపీ, జనసేన, బీజేపీ కూట‌మికి ప్ర‌జాద‌ర‌ణ పెరుగుతోంది. ఈ...
- Advertisement -
- Advertisement -