SreeLeela: శ్రీలీలకు వచ్చిన కష్టం పగవాడికి కూడా రాకూడదు!

SreeLeela: శ్రీలీల.. ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతూనే సినీ ఇండస్ట్రీలో హీరోయిన్‌గా రాణిస్తోంది. తన తల్లిలాగా డాక్టర్ అవ్వాలనుకున్న శ్రీలీల.. ఎవ్వరూ ఊహించని విధంగా కన్నడ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. అయితే వరుస ఆఫర్లు రావడంతో కన్నడ నుంచి తెలుగులో కూడా ఎంట్రీ ఇచ్చింది. శ్రీకాంత్ తనయుడు రోహిత్ హీరోగా డైరెక్టర్ రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ‘పెళ్లి సందడి’ సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా నటించింది. అయితే ఈ సినిమా ఊహించినంత సక్సెస్ అందుకోలేదు. కానీ హీరోయిన్‌గా శ్రీలీలకు మంచి గుర్తింపు అయితే వచ్చింది. దీంతో ఆమెకు తెలుగు సినీ పరిశ్రమలో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. ప్రస్తుతం శ్రీలీల.. మాస్ మహారాజా రవితేజ సరసన ‘ధమాకా’ సినిమాలో నటిస్తోంది.

 

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్స్, పాటలు విడుదలయ్యాయి. ఇందులో శ్రీలీల దుమ్ము దులిపినట్లుగా కనిపిస్తోంది. సినిమా విడుదల అయ్యాక మంచి హిట్ అందుకుంటే శ్రీలీలకు మరింత అవకాశాలు వచ్చే ఛాన్సులు ఉన్నాయి. వయసులో చిన్న అమ్మాయి అయినా.. రెమ్యూనరేషన్ విషయంలో మాత్రం ఎంతో స్ట్రిక్ట్‌ గా ఉంటుందట. తన మొదటి సినిమాకు రూ.20 లక్షలు డిమాండ్ చేసిన ఈ భామ.. ఆ తర్వాత మరో సినిమాకు రూ.80 లక్షలు డిమాండ్ చేసింది. మరికొద్ది రోజుల్లో రూ.కోటి రెమ్యూనరేషన్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి. శ్రీలీల వ్యక్తిగత విషయానికి వస్తే.. శ్రీలీల చిన్నప్పటి నుంచి తండ్రి ప్రేమ లేకుండానే పెరిగింది. ఆమె తల్లి స్వర్ణలతకు ఎన్నారై సూరపనేని శుభాకరరావుతో వివాహం జరిగింది. శ్రీలీల పుట్టకన్న ముందే వీరికి విడాకులు జరిగాయి. కానీ, సొంత తండ్రి శ్రీలీలను తన కూతురు కాదని ప్రచారం చేస్తున్నాడట. దీంతో శ్రీలీల బాధపడుతున్నట్లు సమాచారం. శ్రీలీల అనాథలకు సేవ చేయడానికి కూడా ముందుంటారు. ఇద్దరు వికలాంగులను దత్తత తీసుకుని పెంచుకుంటుంది. వారి చదువులు, బాధ్యత, పెంపకం అన్నీ బాధ్యతలు శ్రీలీలనే దగ్గరుంచి చూసుకుంటారట.

Related Articles

ట్రేండింగ్

Viveka Case: వివేకా హత్య కేసులో మరో షాకింగ్ ట్విస్ట్.. ఆ పరీక్ష కీలకమా?

Viveka Case: వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో భాగంగా రోజురోజుకు కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇలా ఆయన హత్య కేసులో నిందితులను కనుగొనడం కోసం సిబిఐ అధికారులు పెద్ద ఎత్తున...
- Advertisement -
- Advertisement -