T20: టీమిండియాను తక్కువ అంచనా వేయకండి: కేన్ విలియమ్సన్..!

T20: ప్రస్తుతం న్యూజిలాండ్ తో న్యూజిలాండ్ వేదికగా జరుగుతున్న మూడు వన్డేలు, మూడు టీ20లతో కూడిన సీరీస్ కు టీమిండియా కీలక ఆటగాళ్లయిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి విశ్రాంతినిచ్చిన విషయం మనకు తెలిసిందే. అయితే ఆటగాళ్లకు విశ్రాంతి కల్పించిన మాత్రాన ఇండియా జట్టును తక్కువగా అంచనా వేయవద్దని న్యూజిలాండ్ కెప్టెన్ విలియంసన్ తమ ఆటగాళ్లకు సూచించాడు.

 

వర్షం కారణంగా ఇండియా – న్యూజిలాండ్ మధ్య మొదటి టీ20 మ్యాచ్ రద్దయ్యింది. మిగతా రెండు టీ-20ల్లో మెరుగైన ప్రదర్శన చేసి సిరీస్ కైవసం చేసుకోవాలని ఇరుజట్ల ఆటగాళ్లు కోరుకుంటున్నారు. ప్రస్తుత ఫామ్ ను పరిశీలిస్తే ఇరు జట్ల ఆటగాళ్ళు భీకర ఫామ్ లో ఉన్నారు. మ్యాచులు ప్రారంభం అయితే క్రికెట్ అభిమానులు తీవ్ర ఉత్కంఠకు గురయ్యే అవకాశం ఉంది. న్యూజిలాండ్ పరిస్థితులకు అనుగుణంగా టీంఇండియా ఆటగాళ్ళు తమ ఆటలో మార్పులు చేసుకుంటే సరిపోతుంది అని పలువురు అభిప్రాయపడుతున్నారు.

 

తాజాగా జరిగిన విలేకరుల సమావేశంలో విలియమ్సన్ ఇండియా జట్టుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా ద్వితీయశ్రేణి జట్టుగా ఇప్పుడున్న జట్టును పరిగణించాలా అని ఓ విలేఖరి విలియమ్సన్ ను ప్రశ్నించగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి కీలక ఆటగాళ్లు జట్టుకు దూరమైనా ద్వితీయ శ్రేణి జట్టుగా టీమిండియాను పరిగణించబోమని బదులిచ్చాడు. టీమిండియాలో మ్యాచ్ విన్నర్లు ఉన్నారని, ఒంటి చేత్తో మ్యాచులు గెలిపించగలరని ఆశాభావం వ్యక్తం చేశాడు.

 

కొన్నేళ్ల నుంచి టీం ఇండియా ఆటగాళ్ల ప్రదర్శనను దగ్గర నుంచి చూస్తున్నానని, ఐపీఎల్ ద్వారా ఇండియా ఆటగాళ్ల ప్రదర్శన ఏంటో నాకు తెలుసు అని అన్నాడు. న్యూజిలాండ్ ప్లేయర్ విలియమ్సన్ అనుగుణంగా టీమిండియా ఆటగాళ్లు మెరుగైన ప్రదర్శన చేసి వన్డేల్లో, టి20ల్లో సిరీస్ కైవసం చేసుకుంటారో లేదో మనం వేచి చూడాలి. వర్షం కారణంగా మొదటి టీ20 మ్యాచ్ రద్దయిన సంగతి మనకు తెలిసిందే. ఇక న్యూజిలాండ్- ఇండియా మధ్య రెండో టీ20 మ్యాచ్ ఆదివారము మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభంకానున్నది.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కు పోటీ అదే పేర్లతో ఉన్న ఇద్దరు పోటీ.. వైసీపీ కుట్ర చేస్తోందా?

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల త్వరలోనే జరగబోతున్నటువంటి నేపథ్యంలో ఎన్నికల హడావిడి నెలకొంది. ఈ క్రమంలోనే ఎన్నికలకు నామినేషన్ ప్రక్రియ కూడా పూర్తి అయింది. అయితే ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో ఒక్కో...
- Advertisement -
- Advertisement -