Tamannaah: స్టార్ హీరోయిన్ తమన్నా బాధను చూస్తే కన్నీళ్లు పెట్టాల్సిందే!

Tamannaah: ఒకప్పుడు దక్షిణాదిలో మోస్ట్ వాంటెడ్ కథానాయకగా రాణించి ప్రస్తుతం సీనియర్ హీరోల సరసన నటిస్తున్న నటి తమన్న తన ఆవేదనను సోషల్ మీడియా ద్వారా బయటపెట్టింది. ఒకప్పటి స్టార్ హీరోయిన్ ఇప్పుడు కూడా ఆమె చేతిలో పర్వాలేదు అనిపించే సినిమాలు ఉన్నాయి. మరోవైపు ఓటిటిలో కూడా అమ్మడు ఎక్కడ తగ్గడం లేదు.

 

అలాంటి తమన్నా కి ఆవేదన ఏముంటుంది అంటారా.. నిజమేనండి తమన్నా తనపై వస్తున్న విమర్శలకి స్పందించింది. అయితే ఈమె పై వస్తున్న ట్రోలింగ్స్ ఏమిటి అంటే తాజాగా ఆమె నటిస్తున్న వెబ్ సీరిస్ లలో పిచ్చిపిచ్చిగా అందాలు ఆరబోసింది. బాలీవుడ్ లో తమన్నా కర్జ్, లస్ట్ స్టోరీస్ లాంటి హాట్ వెబ్ సిరీస్ లలో కనిపించింది.

మునుపెన్నడు లేనంత అందాల ఆరబోతతో గేట్లు ఎత్తే సీన్లు చేస్తూ దేవుడా అసలు ఈమె తమన్నా ఏనా అన్న సందేహం వచ్చేలా రెచ్చిపోయింది. అలాగే తన ప్రియుడితో సాధిస్తున్న ప్రేమాయణం కూడా ఆమెని ట్రోల్స్ కి గురిచేస్తుంది. సోషల్ మీడియాలో తమన్నాని ఎటిజన్స్ ఒక ఆట ఆడుకుంటున్నారు ఈ వయసులో అవసరమా అంటూ దారుణమైన కామెంట్లు పెడుతున్నారు.

 

దీనికి హార్ట్ అయిన తమన్నా ఘాటుగా రిప్లై ఇచ్చింది. నేను చాలా సార్లు గమనించాను అందరి హీరోలు ప్రతి సినిమాలో వైలెన్స్ తో పాటు అలాంటి సీన్లు కూడా చేస్తారు అలాంటివాళ్లు స్టార్ హీరోలు అయిపోతున్నారు కానీ అదే హీరోయిన్ అలాంటి సీన్లలో నటిస్తే మాత్రం వాళ్ళ క్యారెక్టర్ ని తప్పుపడుతున్నారు. వాళ్లపై దారుణమైన కామెంట్లు చేస్తున్నారు.

 

2023 లో కూడా అమ్మాయిలు ఎలా ఉండాలో వాళ్లే డిసైడ్ చేయటం ఏమిటి.. వాళ్ల మాటల్ని పట్టుకొని సోషల్ మీడియా వాళ్ళు ఏమి తెలుసుకోకుండానే ఆర్టికల్స్ రాసేస్తున్నారు అంటూ తన ఆవేదన వ్యక్తం చేసింది. ఎందుకు హీరో హీరోయిన్లు విషయంలో ఈ వివక్ష అంటూ ప్రశ్నించింది. ప్రస్తుతం ఈ విషయమే నెట్ ఇంట్లో హాట్ టాపిక్ గా మారింది.

 

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -