Sunisith: ఎన్టీఆర్ అభిమానులను వేడుకున్న సునిశిత్.. ఏం జరిగిందంటే?

Sunisith: శాక్రిఫైజ్ స్టార్ సునిశిత్ గురించి మనందరికీ తెలిసిందే. ఇటీవల కాలంలో ఇతని పేరు సోషల్ మీడియాలో మారుమోగుతూనే ఉంది. తరచూ ఏదో ఒక సెలబ్రిటీని టార్గెట్ చేసి అనుచిత వ్యాఖ్యలు చేస్తూ లేనిపోని కాంట్రవర్సీలను కొని తెచ్చుకోవడం తోపాటు దెబ్బలు కూడా తింటున్నాడు. అయినప్పటికీ మనోడికి బుద్ధి రావడం లేదు. అయితే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కావాలనే వారి చానల్స్ రేటింగ్ పెంచుకోవడం కోసం సునిశిత్ ఇంటర్వ్యూలకు పిలిచి హీరో హీరోయిన్ల గురించి మాట్లాడమని చెప్పగా అతగాడు రెచ్చిపోయి మాట్లాడడం ఆ తర్వాత క్షమాపణలు చెప్పడం ఇవన్నీ సర్వసాధారణమైపోయింది.

మనోడు కూడా ఇంటర్వ్యూలలో దొరికింది కదా సందు అన్నట్టు నూటికి ఏది వస్తే అది వాడడం ఆ తర్వాత తన్నలు తినడం అలవాటు అయిపోయింది. మొన్నటికి మొన్న రామ్ చరణ్ ఉపాసన గురించి షాకింగ్ కామెంట్స్ చేయడంతో రాంచరణ్ ఫ్యాన్స్ చితకొట్టారు. ఇక తాజాగా కూడా జూనియర్ ఎన్టీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. జూనియర్ ఎన్టీఆర్‌ నాకు చాలా బెస్ట్ ఫ్రెండ్. ఎంత పెద్ద హీరో అయినా అతను పోర్న్ సినిమాలు చేశాడు. కానీ ఈ విషయం ఎవరికీ తెలియదు. కేవలం నాకు మాత్రమే తెలుసు అంటూ నోటికి వచ్చిన విధంగా వాగాడు.

 

ఎన్టీఆర్ అభిమానులు ఊరుకుంటారా, ఎన్టీఆర్ ను పోర్న్ సినిమాలు చేశాడు అంటావా అంటూ సునిశిత్ పై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. అంతే కాదండోయ్ ఎక్కడ దొరికితే అక్కడ చంపేస్తాం అన్నట్టుగా కర్రలు పట్టుకొని మరీ తిరిగారు. దీంతో సునిశిత్ గత కొద్దిరోజులుగా ప్రాణభయంతో గుప్పు గుప్పుమంటూ పరుగులు తీస్తున్నాడు. కాగా ఎన్టీఆర్ అభిమానుల దెబ్బకు భయపడిపోయిన సునిశిత్ కాళ్ళ భేరానికి వచ్చాడు. ఈ సందర్భంగా ఒక వీడియోని విడుదల చేస్తూ.. ఎన్టీఆర్ గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడం తప్పే. నన్ను క్షమించండి.. ఎన్టీఆర్ గారు నన్ను క్షమించండి.. ఫ్యాన్స్ నా తప్పును మన్నించి.. ఇకనుంచి నన్ను, నా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టవద్దని కోరుకుంటున్నాను.. నేను కూడా ఈరోజు నుంచి ఎన్టీఆర్ కు సపోర్టర్ ను.. థాంక్స్ అని చెప్పుకొచ్చాడు.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -