Kakinada: స్వామియే శరణం అయ్యప్ప.. ఈ వ్యక్తి నిజంగా అదృష్టవంతుడే కదా!

Kakinada: కొన్ని సీన్లు సినిమాలో చూసినప్పుడు ఇలాంటివి బయట జరగడం అసంభవం అనుకుంటాము కానీ అలాంటి విషయాలే బయట జరిగితే ఆశ్చర్యంతో నోరెళ్లబెడతాం. దశావతారం సినిమాలో విష్ణుమూర్తి విగ్రహం ఏ విధంగాఒడ్డుకు కొట్టుకు వచ్చిందో అలాగే కాకినాడలో కూడా అయ్యప్ప స్వామి విగ్రహం ఉద్భవించింది. ఇది నిజంగా జరిగిన ఘటనే. ఆ జాలరి ఇప్పటికీ ఆశ్చర్యం లోనే ఉన్నాడు.

ఇది కాకినాడ జిల్లా యూ కొత్తపల్లి మండలం ఉప్పాడ శివారు ప్రాంతంలో జరిగింది. సూరాడ శివ అనే మత్స్యకారుడు వలలో అయ్యప్ప స్వామి విగ్రహం ప్రత్యక్షమైంది చేపల కోసం వేసిన వాళ్ళ బరువుగా అనిపించడంతో దాని లాగిన మత్స్యకారుడు లోపల అయ్యప్ప స్వామి విగ్రహం ఉండటంతో ఆశ్చర్యానికి గురయ్యాడు. తోటి మత్స్యకారుల సహాయంతో ఒడ్డికి చేర్చారు. ఆ తర్వాత సుబ్బంపేట రామాలయానికి తీసుకొని వెళ్లారు.

 

రాతితో చెక్కబడి చెక్కుచెదరని సుందర రూపంతో కూడిన విగ్రహం కావడంతో అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు స్థానికులు అందరూ విగ్రహాన్ని చూడటానికి పోటెత్తుతున్నారు. కడలి నుంచి తమ వాళ్ళ ద్వారా ఒడ్డుకు చేరిన అయ్యప్ప స్వామికి గుడి కట్టే ఆలోచనలో ఉన్నారు స్థానిక మత్స్యకారులు. అయ్యప్ప మాలలు ధరించే సమయం కాబట్టి ఎవరు అయ్యప్ప స్వామి విగ్రహాన్ని నిమజ్జనం చేయరు. దీంతో ఈ విగ్రహం ఎక్కడ నుంచి కొట్టుకు వచ్చిందో ఎవరికి అర్థం కావడం లేదు ఇది అయ్యప్ప స్వామి మహత్యమే అంటూ ఆనంద పడుతున్నారు భక్తులు.

 

స్వామియే శరణమయ్యప్ప అంటూ తన్మయత్వానికి లోనవుతున్నారు. ఎవరి వలన అయితే విగ్రహం దొరికిందో మత్స్యకారుడి అదృష్టాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు. చుట్టుపక్కల ఉన్న అయ్యప్ప స్వామి భక్తులందరూ వచ్చి ఒక్కొక్కరుగా పూజ చేసుకొని వెళుతున్నారు. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు నిజంగా ఒళ్ళు జలదరిస్తుంది. దేవుడు లేడు అనే వాళ్లకి ఇది కనువిప్పు కలగాలి.

 

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -