Pawan: ఆయన క్రిమినల్ సామ్రాజ్యం కూలదోయకపోతే నా పేరు పవన్ కాదు!

Pawan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా తన వారాహి విజయ యాత్రను కాకినాడలో నిర్వహించారు. ఈ క్రమంలోనే ఆయన స్థానిక ఎమ్మెల్యే పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. జనసేన నేతలు, కార్యకర్తలు, వీర మహిళలు వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ఇంటి దగ్గర నిరసనకు వెళ్తే, ఆ ఎమ్మెల్యే రౌడీలు దాడి చేశారని పవన్ కల్యాణ్ తెలిపారు. తమ నాయకులు పంతం నానాజీ, సందీప్ పంచకర్ లతో పాటు ఇతర నాయకులు, మహిళల మీద దాడులు చేశారని అన్నారు.

తాను ఢిల్లీ నుంచి కాకినాడకు వస్తే ఇక్కడ 144 సెక్షన్ పెట్టారని తెలిపారు. ఆ రోజు కనుక నేను నోరు ఇప్పి ఉంటే ఈ డెకాయిట్ చంద్రశేఖరరెడ్డి ఉండేవాడు కాదు అంటూ పవన్ కల్యాణ్ మండిపడ్డారు. పాలించే ఎమ్మెల్యే క్రిమినల్ అయితే ఏం చేయాలని నిలదీశారు. అయితే, శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా చూడాల్సి ఉంటుంది అని తెలిపారు. తమ ఆడపడుచులను చంద్రశేఖర్ రెడ్డి కొట్టించాడని, ఆయన ఒక విషయం గుర్తు పెట్టుకోవాలని నేటి నుంచి, ఆయన పతనం మొదలవుతుందని తెలిపారు పవన్. ఆయన క్రిమినల్ సామ్రాజ్యం కూలదోయకపోతే తన పేరు పవన్ కల్యాణ్ కాదని తన పార్టీ జనసేనే కాదు అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు పవన్.

 

స్థానిక ఎమ్మెల్యే చాలా దిగజారుడు మాటలు తిడుతుంటారని, తాను ఆవేశంగా మాట్లాడటం లేదని, ఆలోచించి మాట్లాడుతున్నానని తెలిపారు. తన మాటలకు బాధ్యత తీసుకుంటానని తెలిపారు. రెండున్నర సంవత్సరాల క్రితం స్థానిక ఎమ్మెల్యే గెలిచిన మత్తులో, బాగా తాగి నోటికి వచ్చినట్లు మాట్లాడారని తెలిపారు. వైసీపీ వారు కులాలను విడదీస్తారని చెప్పారు. కులదూషణలతో రెచ్చగొడితే మర్యాదగా ఉండదని పవన్ కల్యాణ్ హెచ్చరించారు. ద్వారంపూడి నేర సామ్రాజ్యం నడుపుతున్నారని చెప్పారు. సీఎం జగన్ అండ చూసుకుని అనేక దోపిడీలు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రానికి వైసీపీ కరెక్ట్ కాదు అని తాను 2014లోనే చెప్పానని తెలిపారు అంటూ పవన్ స్థానిక ఎమ్మెల్యే పై ఒక రేంజ్ లో మండిపడ్డారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -