Kakinada: బయటపడిన నకిలీ డాక్టర్ నిజస్వరూపం.. చివరికి?

Kakinada: ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా కూడా నకిలీ వైద్యులు వెలుగులోకి వస్తున్నారు. తెల్లకోటు మెడలో స్టెతస్కోపు ధరించి వైద్యులు అని చెప్పుకొని వారికి తోచిన విధంగా పిచ్చి మందులు ఇచ్చి ప్రజల ప్రాణాలను తీసేస్తున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాట మారుతున్నారు. డబ్బుల కోసం కక్కుర్తి పడి వైద్యవృత్తికే కలంకం తెచ్చే విధంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా అలాంటి ఒక మహిళ నకిలీ డాక్టర్ నిజ స్వరూపం బయటపడింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఈ ఘటన కాకినాడలో వెలుగులోకి వచ్చింది.

ప్రస్తుతం మనకు ఫోటోలో అమాయకంగా కనిపిస్తున్న 24 ఏళ్ల అరుణ సాయి అనే యువతి కాకినాడ జిల్లా సామర్లకోటకు నివసిస్తోంది. కాగా ఆమె గతంలో జీఎన్ఎం కోర్సు పూర్తి చేసింది. దీంతో అప్పటి నుంచి ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలకు ప్రయత్నం మొదలు పెట్టింది. కానీ, ఎక్కడా కూడా ఆమెకు ఉద్యోగం లభించలేదు. చివరి సారిగా జీజీహెచ్ లో ఉద్యోగం కోసం ప్రయత్నించినా అక్కడ కూడా ఉద్యోగం రాలేదు. లాభం లేదు అనుకున్న యువతి ఎలా అయినా డబ్బులు సంపాదించాలి అనుకొని నకిలీ డాక్టర్ అవతారం ఎత్తింది. ఇక రోజూ జీజీహెచ్ ఆస్పత్రికి వెళ్లేది.

 

ఆమెను చూసి జనాలంతా నిజంగానే డాక్టర్ అనుకునేవారు. ఈ క్రమంలోనే అరుణసాయికి కాకినాడకు చెందిన మాధురి, మమత అనే ఇద్దరు యువతులు పరిచమయ్యారు. మెల్లగా వారితో స్నేహం చేసి నమ్మకంగా మెలిగింది. ఆ తర్వాత మీకు ఆరోగ్య మిత్రలో ఉద్యోగాలు ఇప్పిస్తానని వారిని నమ్మించింది. అరుణ సాయి మాటలు విన్న ఆ ఇద్దరు యువతలు ఇదంతా నిజమే అనుకున్నారు. అయితే ఆ ఉద్యోగాలు కావాలి అంటే కొంత డబ్బు ఖర్చు అవుతుందని కూడా చెప్పింది. ఆ యువతి మాటలు విన్న ఆ ఇద్దరు యువతులు అరుణ కీ మాధురి, మమత ఏకంగా రూ.47 వేలు ఇచ్చారు. అలా కొన్ని నెలలు గడిచింది. కానీ, వారికి ఉద్యోగాలు మాత్రం లభించలేదు. అరుణ సాయిని కలిసేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసిన ఆమె దొరకలేదు. దాంతో మోసపోయామని గ్రహించిన ఆ ఇద్దరు యువతులు గురువారం జీజీహెచ్ కు వెళ్లారు. జరిగిందంతా అక్కడి అధికారులకు వివరించారు. ఇక సెక్యూరిటీ గార్డ్ సాయంతో ఎట్టకేలకు నకిలీ డాక్టర్ అరుణ సాయిని పట్టుకుని నిలదీశారు. అక్కడా తీరా వారికి తెలిసింది ఏంటంటే ఆమె డాక్టర్ కాదని, నకిలీ డాక్టర్ అని తెలుసుకుని ఇద్దరు యువతులు నెత్తి, నోరు బాదుకున్నారు. అనంతరం అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి ఆ యువతిని అరెస్ట్ చేశారు.

 

Related Articles

ట్రేండింగ్

Pithapuram: పిఠాపురంలో ఫుల్ సైలెంట్ అయిన ఓటర్లు.. మద్దతు ఏ పార్టీకి అంటే?

Pithapuram:  ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రత్యర్థుల మీద మాటల దాడి చేస్తూ తమ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు రాజకీయ నాయకులు. ఆ పార్టీ ఈ పార్టీ అనే కాకుండా ప్రతి పార్టీ వారు తమ...
- Advertisement -
- Advertisement -