Pawan Challenge: పవన్ ఛాలెంజ్ ను స్వీకరించడం ద్వారంపూడికి సాధ్యమేనా?

Pawan Challenge: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వారాహి యాత్రలో పాల్గొన్న విషయం మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే కాకినాడలో ఈయన ఈ యాత్రలో పాల్గొని ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఈయన బియ్యం స్మగ్లింగ్ చేసి దాదాపు 15 వేల కోట్లు పోగు చేశారు అంటూ తీవ్రస్థాయిలో విమర్శలు కురిపించారు. ఇలా పవన్ కళ్యాణ్ ద్వారంపూడి పై చేసిన ఈ వ్యాఖ్యలపై చంద్రశేఖర్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించి పవన్ కళ్యాణ్ కు ఛాలెంజ్ విసిరారు .

ఈ సందర్భంగా చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలపై తనదైన స్టైల్ లో సమాధానం చెప్పారు.తలుచుకుంటే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఫ్లెక్సీలను కూడా కాకినాడలో కట్టలేరని తాను తనకన్నా ఎక్కువ తెగింపు కలవారిని తెలిపారు. పవన్ కళ్యాణ్ కేవలం మాటల వరకే ఉంటాయి కానీ నేను చేతల రూపంలో కూడా చూపిస్తాను అని చంద్రశేఖర్ రెడ్డి తెలియచేశారు.

 

ఇక తాను బియ్యం స్మగ్లింగ్ చేసి 15000 కోట్ల పోగు చేశానని చెప్పావు నా దగ్గర అంత డబ్బే కనుక ఉంటే ఈపాటికి నిన్ను కొనేసే వాడిని అంటూ ఈయన కామెంట్ చేశారు.పవన్ కళ్యాణ్ రాజకీయాలలో జీరో ఆయన ఒక రాజకీయ వ్యభిచారి రెండు చోట్ల ఎమ్మెల్యేగా పోటీ చేసిన పవన్ కళ్యాణ్ ఒకచోట కూడా గెలవలేకపోయారని తాను మాత్రం రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచానని ద్వారం పొడి చంద్రశేఖర్ రెడ్డి పవన్ పై విరుచుకుపడ్డారు.

 

పవన్ కళ్యాణ్ ప్రజా సంక్షేమం కోసం వారాహి యాత్ర చేపట్టలేదని ఈయన ప్యాకేజీ విషయంలో డీల్ కుదరకపోవడంతోనే తాను కూడా సీఎం రేసులో ఉన్నాను అంటూ వారాహి యాత్ర ద్వారా రోడ్డుపైకి వచ్చారని తెలియజేశారు.పవన్ కళ్యాణ్ కు మాటలలో స్థిరత్వం లేదని ఒక్కో రోజు ఒక్కో మాట మారుస్తూ ఉంటారని తెలిపారు. అలాగే దమ్ము ధైర్యం ఉంటే కాకినాడలో పోటీ చేసి గెలవాలని ద్వారంపూడి సవాల్ విసిరారు. అయితే పవన్ కళ్యాణ్ పోటీ చేయబోతున్నటువంటి నియోజకవర్గాలలో కాకినాడ పేరు కూడా వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -