Chandrababu: చంద్రబాబు డైరెక్షన్ లోనే స్వాతిరెడ్డి నాటకాలు.. ఇంతకు మించి ప్రూఫ్స్ కావాలా?

Chandrababu: ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిన పేర్లలో స్వాతిరెడ్డి ఒకటనే సంగతి తెలిసిందే. చంద్రబాబు స్వయంగా స్వాతిరెడ్డి పేరును ప్రస్తావించడంతో సోషల్ మీడియా వేదికగా ఆమె పేరు మారుమ్రోగింది. జగన్ ను తిడుతూ తరచూ వార్తల్లో నిలిచే స్వాతిరెడ్డి గురించి వాస్తవాలు తెలిసి షాకవ్వడం నెటిజన్ల వంతవుతోంది. ఆమె ఎన్నారై కాకపోయి ఉంటే ఈపాటికే జైలులో ఊచలు లెక్కపెడుతూ ఉండేదని కామెంట్లు వినిపిస్తున్నాయి.


స్వాతిరెడ్డి అని పేరు చెప్పుకుని టీడీపీకి ప్రచారం చేస్తున్న ఈ అమ్మాయి అసలు పేరు శ్వేతా చౌదరి. స్వాతిరెడ్డి అనే పేరుతో జగన్ ను తిడితే రెడ్డి వర్గం వాళ్లు విమర్శలు చేయరని భావించి ఆమె ఈ విధంగా నాటకాలు మొదలుపెట్టారని సమాచారం. ఈ కుట్రలో చంద్రబాబుకు కూడా భాగం ఉన్నా బాబు మాత్రం వాస్తవాలు బయటపడకుండా జాగ్రత్త పడుతున్నారు. ఫేక్ ప్రచారం ద్వారా జగన్ పేరును బద్నాం చేయాలని బాబు భావిస్తున్నారు.


చౌదరి అనే పేరుతో ఉన్నవాళ్లు విమర్శలు చేస్తే జనం నమ్మరని చంద్రబాబు ఈ తరహా కుట్రలకు తెర లేపారని బోగట్టా. స్వాతిరెడ్డీ పోస్టులు మరీ దిగజారిన విధంగా ఉంటాయని కామెంట్లు వినిపిస్తున్నాయి. చంద్రబాబు పాలన ఎలా ఉంది అంటే మ్యాటర్ వీక్ పబ్లిసిటీ పీక్ అని ఎవరైనా చెబుతారు. డొల్ల ప్రచారంతో ఏదో సాధించానని ప్రచారం చేసుకోవడం ఆయనకే చెల్లింది. చంద్రబాబు పనితీరుకు 2019 ఎన్నికల ఫలితాలే సాక్ష్యమని చెప్పవచ్చు.

జగన్ పై స్వాతిరెడ్డి పేరుతో టీడీపీ కుట్రకు తెర లేపగా ఇప్పుడిప్పుడే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. జగన్ కుటుంబ సభ్యులపై కూడా శ్వేతా చౌదరి అలియాస్ స్వాతిరెడ్డి చిల్లర కామెంట్లు చేస్తూ తన వక్ర బుద్ధిని చూపిస్తున్నారు. ప్రజా క్షేత్రంలో జగన్ కు పోటీ ఇవ్వడం ఎప్పటికీ సాధ్యం కాదని భావించి స్వాతిరెడ్డి ఇలాంటి కుట్రలు చేస్తున్నారు. స్వాతిరెడ్డికి తాను అండగా ఉంటానంటూ చంద్రబాబు తన నీచమైన ప్లాన్ ను చెప్పకనే చెప్పేశారు. కులాన్ని అడ్డు పెట్టుకుని స్వాతిరెడ్డి చేస్తున్న రాజకీయాలు నీచంగా ఉన్నాయని ఇప్పటికైనా ఆమె తీరు మారాలని వైసీపీ అభిమానులు కోరుకుంటున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -