T20 World Cup 2022: ఆస్ట్రేలియా అయితే ఏంటి తొక్క.. ఆ సంప్రదాయాన్ని పాటించాల్సిందే..

T20 World Cup 2022: క్రికెట్‌లో వెస్టిండీస్ ప్రభ తగ్గడం ప్రారంభమయ్యాక ఆ స్థానాన్ని ఆస్ట్రేలియా దక్కించుకుంది. 1990ల నుంచి ఆ జట్టు తిరుగులేని ఆధిక్యంతో ప్రపంచ క్రికెట్ ను శాసించింది. స్వదేశంలో అయినా విదేశాల్లో అయినా తమకు ఎదురేలేదని నిరూపిస్తూ ఐదు వన్డే ప్రపంచకప్ లు సాధించిన ఆ జట్టు.. గతేడాది యూఏఈ వేదికగా ముగిసిన టీ20 ప్రపంచకప్ లో ఫైనల్‌లో కివీస్‌ను ఓడించి తొలి టైటిల్ ను దక్కించుకుంది. అయితే తాజాగా ఆస్ట్రేలియా గడ్డపై జరుగుతున్న టీ20 ప్రపంచకప్ లో మాత్రం కంగారూలు సెంటిమెంట్‌ను తప్పించుకోలేకపోయారు.

ఏంటా సెంటిమెంట్..?

ఇప్పటివరకు ఏడు టీ20 ప్రపంచకప్ టోర్నీలు ముగిశాయి. ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న ఈ టోర్నీ ఎనిమిదో ఎడిషన్. ఈ టోర్నీలలో ప్రపంచకప్ కు ఆతిథ్యం ఇచ్చిన ఒక్క జట్టు కూడా టైటిల్ కొట్టలేదు. ఆ సంప్రదాయం 2007 నుంచి అలాగే కొనసాగుతున్నది. తాజాగా ఇంగ్లాండ్-శ్రీలంక మధ్య ముగిసిన మ్యాచ్ లో లంక ఓడటంతో ఇంగ్లీష్ జట్టు సెమీస్ కు అర్హత సాధించింది. దీంతో కంగారూల కథ కంచికి చేరింది.

ఇదిగో చరిత్ర..

టీ20 ప్రపంచకప్ టోర్నీ తొలిసారి 2007లో ప్రారంభమైంది. సౌతాఫ్రికాలో ఈ టోర్నీ జరిగింది. కానీ విజేత ఇండియా. ఆ తర్వాత వరుసగా చూస్తే.. 2009లో ఇంగ్లాండ్ లో టోర్నీ జరుగగా పాకిస్తాన్ విజేతగా నిలిచింది. 2010లో వెస్టిండీస్ లో నిర్వహించగా ఇంగ్లాండ్ కప్పు కొట్టింది. 2012లో శ్రీలంకకు ఆతిథ్య హక్కులు దక్కగా వెస్టిండీస్ టైటిల్ ఎగురేసుకుపోయింది. 2014లో బంగ్లాదేశ్ ఆతిథ్యమివ్వగా శ్రీలంక గెలిచింది.

2016లో ఇండియాలో ఈ టోర్నీ జరుగగా వెస్టిండీస్ రెండోసారి ట్రోపీ గెలుచుకుంది. 2021లో యూఏఈ ఆథిత్యమివ్వగా ఆస్ట్రేలియా కప్ కొట్టింది. ఇక 2022లో ఆస్ట్రేలియాలో జరుగుతున్న ఈ టోర్నీలో ఫైనల్ చేరి కప్పు కొట్టేది ఎవరైనా ఆతిథ్య దేశం మాత్రం సెమీస్ చేరకుండానే నిష్క్రమించింది. దీంతో సెంటిమెంట్ పునరావృతమైంది. ఆస్ట్రేలియా అగ్రశ్రేణి జట్టు అయినంత మాత్రానా ఆ సెంటిమెంట్ నుంచి తప్పించుకోలేదని సోషల్ మీడియా వేదికగా క్రికెట్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఆస్ట్రేలియా నిష్క్రమించడంతో ఈ టోర్నీలో గ్రూప్-1 నుంచి న్యూజిలాండ్, ఇంగ్లాండ్ లు సెమీస్ చేరాయి.

 

 

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -