Cricket: టీమిండియా సూపర్ రికార్డు.. శ్రీలంక వరస్ట్ రికార్డు

Cricket: కోల్‌కతా వన్డేలో విజయం సాధించిన టీమిండియా వన్డే ఫార్మాట్‌లో చరిత్ర సృష్టించింది. ప్రత్యర్థిపై అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా ఆస్ట్రేలియా రికార్డును సమం చేసింది. రెండో వన్డేలో విజయం సాధించిన భారత్ మూడు వన్డేల సిరీస్ కైవసం చేసుకుంది. శ్రీలంకపై వన్డేల్లో భారత్‌కు ఇది 95వ విజయం. దీంతో గతంలో న్యూజిలాండ్‌పై ఆస్ట్రేలియా సాధించిన 95 వన్డేల విజయ రికార్డును తాజాగా టీమిండియా సమం చేసింది. అంతేకాకుండా శ్రీలంకపై భారత్‌కు ఇది 26వ ద్వైపాక్షిక సిరీస్ విజయం.

 

ప్రత్యర్థిపై అత్యధిక విజయాలు సాధించిన జట్ల జాబితాలో భారత్-ఆస్ట్రేలియా సంయుక్తంగా అగ్రస్థానంలో ఉండగా పాకిస్థాన్ రెండో స్థానంలో నిలిచింది. టీమిండియా తరహాలో పాకిస్థాన్ కూడా అత్యధిక విజయాలు శ్రీలంకపైనే సాధించాయి. మొత్తంగా వన్డేల్లో శ్రీలంకపై పాకిస్థాన్ 92 విజయాలను నమోదు చేసింది.

 

అయితే టీమిండియా సూపర్ రికార్డును నెలకొల్పగా శ్రీలంక మాత్రం వరస్ట్ రికార్డును మూటగట్టుకుంది. అటు కోల్‌కతా వన్డే ఓటమితో శ్రీలంక చెత్త రికార్డును నమోదు చేసింది. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక ఓటములు చవి చూసిన జట్టుగా శ్రీలంక అప్రతిష్టను మూటగట్టుకుంది. వన్డేల్లో ఇప్పటి వరకు 437 మ్యాచ్‌లు ఓడిన శ్రీలంక.. టీ20ల్లో 94 మ్యాచ్‌లు ఓడిపోయింది.

 

నామమాత్రంగా మారిన మూడో వన్డే
శ్రీలంకతో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0 తేడాతో భారత్ కైవసం చేసుకుంది. దీంతో తిరువనంతపురంలో జరిగే మూడో వన్డే నామమాత్రంగా మారింది. అయితే ఈ వన్డేలో అయినా ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ లాంటి ప్రతిభావంతులకు అవకాశాలు ఇవ్వాలని క్రికెట్ అభిమానులు కోరుతున్నారు. వీళ్లిద్దరికీ జట్టులో స్థానం కల్పిస్తే శుభ్‌మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్ రిజర్వ్ బెంచ్‌కు పరిమితం కావాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ వన్డేలో కూడా భారత్ విజయం సాధిస్తే వన్డేల్లో ప్రత్యర్థిపై అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా ఆస్ట్రేలియాను టీమిండియా బీట్ చేయనుంది.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కు పోటీ అదే పేర్లతో ఉన్న ఇద్దరు పోటీ.. వైసీపీ కుట్ర చేస్తోందా?

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల త్వరలోనే జరగబోతున్నటువంటి నేపథ్యంలో ఎన్నికల హడావిడి నెలకొంది. ఈ క్రమంలోనే ఎన్నికలకు నామినేషన్ ప్రక్రియ కూడా పూర్తి అయింది. అయితే ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో ఒక్కో...
- Advertisement -
- Advertisement -