Taapsee Pannu: స్టార్ హీరోయిన్ తాప్సీ కొత్త కారు ధర ఎంతో తెలుసా.. కారు కోసం ఈ రేంజ్ లో ఖర్చు చేసిందా?

Taapsee Pannu: ఝుమ్మంది నాదం అనే చిత్రంతో టాలీవుడ్ లో పరిచయమైన నటి తాప్సి తర్వాత షాడో, వీర, మిస్టర్ పర్ఫెక్ట్ లాంటి సినిమాలు తో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. తన సహజమైన నటనకు ప్రేక్షకులు ఆకర్షితులు అయ్యారు. అయితే ఈ మధ్య తాప్సి తెలుగులో అంతగా అలరించకపోయిన సరే హిందీలో మాత్రం ఎప్పటికప్పుడు సినిమాలు తీస్తూనే ఉన్నది.

ఈమె కొత్తగా వినాయక చవితి నాడు ఒక కార్ని కొన్నది. ఆ కార్ తో ఫోటోలు దిగి సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి వైరల్ అయ్యాయి. ఆ కార్ వివరాలేంటో ఒకసారి చూద్దాం. మెర్సెడెస్ మేబారచ్ జీఎల్ఎస్ 600 (Mercedes Maybach GLS 600) ఎస్‍యూవీ కారును తాప్సీ పన్ను కొనుగోలు చేశారు. ఈ కారు ఎక్స్-షోరూం ధర రూ.2.92కోట్లుగా ఉంది.

మొజావే సిల్వర్ సింగిల్ టోన్ కలర్ ఫినిష్ ఉన్న కారును ఆమె తీసుకున్నారు. ఆన్‍రోడ్ ధరను బట్టి చూస్తే ఈ కారు ధర రూ.3కోట్లు దాటి ఉంటుంది. లాంజ్ స్టైల్ సీటింగ్, పానరామిక్ సన్‍రూఫ్, ఫోర్ జోన్ క్లైమేట్ కంట్రోల్, మసాజింగ్ సీట్లు, బర్మెస్టర్ సౌండ్ సిస్టమ్, వర్చువల్ అసిస్టెంట్, స్మాల్ రిఫ్రిజిరేటర్ సహా చాలా అడ్వాన్స్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లను ఈ కారు కలిగి ఉంటుంది.

మెర్సెడెస్ మేబారచ్ జీఎల్ఎస్ 600 కారులో 4.0-లీటర్ ట్విన్ టర్బో వీ8 పెట్రోల్ పవర్ ఫుల్ ఇంజిన్ ఉంటుంది. 9జీ ట్రోనిక్ ఆటోమేటిక్ గేర్ బాక్స్, మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీతో ఈ కారు వస్తోంది. 550 హెచ్‍పీ వరకు పవర్, 730 ఎన్ఎం వరకు పీక్ టార్క్యూను ఈ ఇంజిన్ జనరేట్ చేయలగదు. 12.3 ఇంచుల ఇన్ఫోటైన్‍మెంట్ టచ్ స్క్రీన్, 12.3 ఇంచుల డ్రైవర్ డిస్‍ప్లే కూడా ఉంటాయి. మొత్తంగా చాలా లగ్జరీ ఫీచర్లు ఈ మెర్సెడెస్ కారులో ఉంటాయి.

 

View this post on Instagram

 

A post shared by First Buzz (@realfirstbuzz)

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -