Taapsee: తాప్సీని ఆ డైరెక్టర్ దారుణంగా హింసించాడా?

Taapsee: ఇప్పుడు ఎక్కువగా సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అనే పేరు వినపడుతోంది. అయితే కొందరు తెలిసి తప్పు చేస్తుంటే మరికొందరు తెలియక చేస్తుంటారు. టాలీవుడ్ లో పాపులర్ అయిన హీరోయిన్ తాప్సీని కూడా ఓ స్టార్ డైరెక్టర్ ఇబ్బందికరంగా ప్రవర్తించాడట. ఝుమ్మంది నాదం అనే సినిమాతో తెలుగు తెరకు ఈమె పరిచయం అయ్యింది. మొదటి సినిమాతో సక్సెస్ అందుకుంది. ఈ సినిమా అప్పట్లో పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది.

 

ఈ సినిమాలో “ఏం సక్క గున్నావ్ రో ..నా సొట్ట సంపలోడా..” అనే సాంగ్ చాలా మందికి కనెక్ట్ అయ్యింది. ఆ సినిమా తర్వాత ఒక్కొక్కటిగా తన స్టైల్ మార్చుకుంటూ తాప్సీ బోల్డ్ తాప్సిగా మారిపోయింది. అయితే ఈమె తెలుగులో సినిమాలు చేస్తున్న సమయంలో ఓ డైరెక్టర్ ఆమెతో సరదాగా ఉండేవాడని, తన బుగ్గల్ని చపాతీ పిండిలా పిసికేసేవాడని అప్పట్లో ఆమె బాధపడిందట. అంతేకాదు అతని డైరెక్షన్లో ఒక సినిమాకే చుక్కలు చూసిన తాప్సి రెండో సినిమా అవకాశం వచ్చినా చేయనందట.

 

ప్రస్తుతం టాలీవుడ్ కి దూరంగా బాలీవుడ్ కి దగ్గరగా తాప్సి ఉంటోంది. సొంతంగా ప్రొడక్షన్ హౌస్ ని కూడా తాప్సీ నడుపుతోంది. త్వరలోనే సమంత హీరోయిన్ గా తాప్సి ప్రొడక్షన్ హౌస్ లో ఓ సినిమా రానుంది. ఈ సినిమాపై త్వరలోనే మరిన్ని వివరాలు తెలియనున్నాయి.

 

ఏదేమైనా ఇండస్ట్రీలో ఇలాంటి డైరెక్టర్స్ హీరోయిన్స్ ను ఇబ్బంది పెడతారా అని కొందరు ఫైర్ అవుతున్నారు. హీరోయిన్లను పండులా పిండేస్తారా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే కొందరు హీరొయిన్లు ఇటువంటి విషయాలు జరిగితే పబ్లిక్ కు ఇప్పుడిప్పుడే తెలుపుతున్నారు. మరికొందరు మాత్రం వాటిని ఎక్కడికక్కడ వదిలేస్తున్నారు. తాప్సీ కూడా ఇటువంటి విషయాలపై ఈమధ్య కాలంలో ఏదీ షేర్ చేసుకోలేదు. అయితే గత అనుభవాలను మాత్రం అప్పుడప్పుడూ చెబుతూ వచ్చేది.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -