TDP Alliance – YSRCP: ఈ సీట్లలో కూటమిదే విజయం.. వైసీపీ ఎంత ట్రై చేసినా గెలవడం కష్టమంటూ?

TDP Alliance – YSRCP: ఏపీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో రాజకీయ వేడి రాజుకుంది మరి కొద్ది రోజులలో ఎన్నికలు జరగబోతున్నటువంటి నేపథ్యంలో ప్రచార కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు. ఇకపోతే ఈ ఎన్నికల పట్ల ఆంధ్ర మాత్రమే కాకుండా తెలంగాణలో కూడా భారీ స్థాయిలో ఆసక్తి పెరిగిపోయింది. వైఎస్ఆర్సిపి పార్టీ సింగిల్ గా పోటీ చేస్తూ ఉండగా తెలుగుదేశం బిజెపి జనసేనలతో పొత్తు పెట్టుకుని మరి ఎన్నికల బరిలోకి దిగిపోతుంది.

ఇదిలా ఉండగా ఉత్తరాంధ్రలో జనసేన ఎక్కువగా పోటీ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే .ఈ క్రమంలోనే అందరి ఆసక్తి ఈ ఉత్తరాంధ్ర పైనే ఉంది గత ఎన్నికలలో ఉత్తరాంధ్రలో 34 అసెంబ్లీ స్థానాలకు గాను వైసీపీ ఏకంగా 28 అసెంబ్లీ స్థానాలను గెలుపొంది సంచలనాలను సృష్టించింది అయితే ఈ ఎన్నికలలో వైసిపి అదే మ్యాజిక్ సృష్టించడం సాధ్యమేనా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ఎన్నికలలో మొత్తం సీట్లలో కూడా తమ జెండా ఎగిరే విధంగా వైసిపి వ్యూహాలు వేస్తోంది. ఇకపోతే ఇటీవల ఈ 34 స్థానాలకు గాను అభ్యర్థుల ప్రకటన తెలియజేసిన సంగతి తెలిసిందే .గతంలో టికెట్లు ఇచ్చిన వారికి ఈసారిలో టికెట్లు రావని చాలామంది భావించారు కానీ సిట్టింగులకే టికెట్లు ఇవ్వడంతో గమనార్హం. దీంతో సెట్టింగ్ ఎమ్మెల్యేల పట్ల పూర్తిస్థాయిలో వ్యతిరేకత ఏర్పడటంతో ఈసారి గెలవడం కష్టతరమని భావిస్తుంది.

గత ఎన్నికలలో పోలిస్తే ఈ ఎన్నికలలో సుమారు పది నియోజకవర్గాలలో వైసిపి గెలుపు చాలా టఫ్ గా అనిపిస్తుంది. ఈ పది నియోజకవర్గాలు మినహా మిగిలిన నియోజకవర్గం వైసీపీకి కూటమికి భారీ పోటీ ఉన్న నేపథ్యంలో ఎక్కువ శాతం కూటమికే గెలుపు వచ్చే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. మరి ఎన్నికలలో ప్రజా తీర్పు ఎలా ఉంటుంది ఏంటి అనే విషయాలు త్వరలోనే తెలియని ఉన్నాయి.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -