YSRCP – TDP: ఏపీలో వైసీపీకి దబిడి దిబిడే.. టీడీపీ అభ్యర్థుల లెక్క తేలడంతో వైసీపీకి వణుకేనా?

YSRCP – TDP: అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ మరొక రోజులో వెలబడబోతున్నటువంటి తరుణంలో అన్ని పార్టీలు అభ్యర్థులను ప్రకటించారు. ఇప్పటికే తెలుగుదేశం జనసేన పొత్తులో భాగంగా గతంలో తొలి విడతలు 99 మంది అభ్యర్థులను ప్రకటించారు అయితే తాజాగా రెండో విడతలో భాగంగా అభ్యర్థుల జాబితాను ప్రకటించారు అయితే తొలి విడతలో భాగంగా ఏ విధమైనటువంటి సమస్య లేనటువంటి నియోజకవర్గాలన్నింటికీ అభ్యర్థులను ఖరారు చేశారు.

ఇక మిగిలిన అభ్యర్థుల జాబితాను గురువారం తెలుగుదేశం పార్టీ అధినేత జనసేన పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ల సమక్షంలో విడుదల చేశారు. ఈ రెండో జాబితాలో భాగంగా కొంతమంది తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలకు చోటు దక్కకపోవటంతో పలుచోట్ల వ్యతిరేకత వచ్చినప్పటికీ చంద్రబాబు నాయుడు మాత్రం వారికి స్వయంగా ఫోన్ చేసి కాస్త సమయమనం పాటించాలి అంటూ వారిని బుజ్జిగిస్తున్నారని తెలుస్తుంది.

ఇలా ఇప్పటికే ప్రకటించిన అభ్యర్థుల ఎంపిక చాలా పకడ్బందీగా జరిగిందని తెలుస్తుంది. ఎన్నో సర్వేలను నిర్వహించి గెలుపును పొందే అవకాశం ఉన్నటువంటి వారికే ఈ టికెట్లను కేటాయించినట్లు తెలుస్తోంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం 19 అసెంబ్లీ స్థానాలకు ఇప్పటి వరకు రెండు జాబితాల్లో కలిపి టీడీపీ, జనసేన 17 సీట్లలో అభ్యర్థులను ప్రకటించినట్టయింది. ఇంకా కాకినాడసిటీ, అమలాపురం నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఎవరు అనే విషయంపై కాస్త సస్పెన్షన్ ఉంది.

ఇకపోతే పవన్ కళ్యాణ్ ఏ నియోజకవర్గ నుంచి పోటీ చేయబోతున్నారు అన్న విషయం గురించి ఇదివరకు పెద్ద ఎత్తున సస్పెన్షన్ ఉండేది అయితే ఆ సస్పెన్షన్ కి తెర తీస్తూ పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నట్లు ఆయన స్వయంగా వెల్లడించారు. దీంతో అక్కడ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నటువంటి టిడిపి నేత వర్మ కాస్త ఆగ్రహానికి గురి కావడంతో స్వయంగా చంద్రబాబు తనతో మాట్లాడి తనని శాంత పరిచారని తెలుస్తుంది.

మొత్తానికి టిడిపి రేసుగుర్రాలు అన్నింటిని చంద్రబాబు ప్రకటించడంతో వైసిపి నేతలలో వణుకు పుడుతుందని స్పష్టంగా తెలుస్తుంది. టిడిపి అభ్యర్థుల లెక్క తేలడంతో జగన్మోహన్ రెడ్డి తన అభ్యర్థుల విషయంలో తర్జన భర్జనకు గురవుతున్నారని తెలుస్తోంది. అయితే వైసిపి నుంచి ఇప్పటివరకు కొంతమంది అభ్యర్థుల పేర్లను మాత్రమే ప్రకటించారు త్వరలోనే ఈయన కూడా అభ్యర్థుల జాబితాని విడుదల చేయబోతున్నారని తెలుస్తుంది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -