TDP: ఉమ్మడి తూర్పు గోదావరి లెక్కలు ఇవే.. టీడీపీ, జనసేనలలో ఏ పార్టీకి ఎన్నంటే?

TDP: ఎన్నికల సమయం ఆసన్నమవుతున్నటువంటి తరుణంలో ఇప్పటికే అన్ని పార్టీ నేతలు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేస్తున్నారు. అయితే తాజాగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలలో అభ్యర్థుల ఎంపిక దాదాపు ఖరారు అయిందని తెలుస్తుంది ఈ జిల్లాలో 19 నియోజకవర్గాల్లో ఉండగా ఇప్పటికే 10 నియోజకవర్గాలలో టిడిపి నేతలు కరారయ్యారు.

మరో మూడు నియోజకవర్గాలలో జనసేన పార్టీ నేతలకు ఫిక్స్ చేశారు మిగిలిన 6 నియోజకవర్గాలలో అభ్యర్థుల ఎంపికపై తర్జనభజన చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి ఖరారు అయినటువంటి పదిమంది అభ్యర్థులు ఎవరు అనే విషయానికి వస్తే పార్టీ సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడి కుమార్తె దివ్య-తుని, వరుపుల సత్యప్రభ-ప్రత్తిపాడు, నిమ్మకాయల చినరాజప్ప-పెద్దాపురం నుంచి పోటీ చేయబోతున్నారు.

నల్లమిల్లి రామకృష్టారెడ్డి-అనపర్తి, దాట్ల సుబ్బరాజు, బండారు సత్యానందరావు-కొత్తపేట, వేగుళ్ల జోగేశ్వరరావు-మండపేట, గోరంట్ల బుచ్చయ్య చౌదరి- రాజమండ్రి రూరల్‌, జ్యోతుల నెహ్రూ-జగ్గంపేట.. ఉన్నారు. రాజమండ్రి అర్బన్‌లో టికెట్ విషయంలో తెలుగుదేశం పార్టీ పునర్ ఆలోచనలో ఉందని తెలుస్తుంది.

తొలుత కుటుంబానికి టికెట్ ఇవ్వగా సర్వేల్లో భవాని వైపే మొగ్గు వ్యక్తమవుతుండడంతో ఈ నియోజకవర్గంలో కాస్త ఆలోచనలు పడ్డారు. ఇక జనసేన పార్టీకి కాకినాడ రూరల్‌, రాజానగరం, రాజోలు సీట్లను పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించినట్లు తెలుస్తోంది. ఇలా మూడు సీట్లు మాత్రమే కాకుండా మరో రెండు సీట్లను జనసేన ఆశిస్తున్నారని తెలుస్తుంది మరి మిగిలిన ఆరు నియోజకవర్గాలలో ఏ పార్టీకి ఎన్ని సీట్లను ఖరారు చేస్తారు అనే విషయం తెలియాల్సి ఉంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -