AP Pensions: పెన్షన్ల సమస్యతో ఆయన పదవి పోవడం ఖాయమా.. ఆయన వల్లే ఆ ప్రాణాలు పోయాయా?

AP Pensions: ప్రతి నెలా మొదటి రోజు రావాల్సిన సామాజిక పెన్షన్.. ఐదో తేదీ వచ్చినా లబ్ధిదారులకు అందలేదు. ఒకటో తేదీన ఉదయమే ఇంటికి వచ్చి వాలంటీరు పింఛన్ మొత్తాన్ని అందించేవారు. కానీ ఈ నెల రాకపోవడంతో పండుటాకులకు ఎదురుచూపులు తప్పడం లేదు. అయితే దీనికి కారణం మీరంటే మీరు అని అధికార వైసీపీ, విపక్ష టీడీపీ వాదులాడుకుంటున్నాయి. ప్రభుత్వ ఖజానాలో డబ్బులు లేకపోవడం వల్లే ఇవ్వడం లేదని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది. అయితే వాలంటీర్ల పై ఈసీకి ఫిర్యాదు చేయడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందంటూ వైసీపీ ప్రత్యారోపణ చేస్తోంది. ఆల్ మోస్ట్ మూడు రోజులపాటు పింఛన్ల పంపిణీలో జాప్యం జరిగింది.

మంగళవారం నుంచి పింఛన్ల పంపిణీ ప్రారంభమైనప్పటికీ ఆ ప్రక్రియ చాలా స్లోగా జరుగుతోంది. అయితే గతం మాదిరిగా కాకుండా.. సచివాలయానికి వెళ్లి పింఛన్ అందుకోవాల్సి రావడంతో లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పింఛన్ అందుకోవడానికి సచివాలయానికి వెళ్లిన ఇద్దరు వడదెబ్బతో చనిపోయారు. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఇదంతా టీడీపీ వలనేనని వైసీపీ ఆరోపిస్తుంది. కానీ.. వైసీపీ ఆరోపణలను టీడీపీ నేతలు గట్టిగానే తిప్పికొడుతున్నారు. పింఛను మరణాలను కారణం ప్రభుత్వ వైఫల్యమేనని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ నేతలకే కాకుండా.. వైసీపీకి అనుకూలంగా ఉండే అధికారుల తీరును కూడా టీడీపీ ఎండగడుతుంది. ఖజానాలో డబ్బు లేకపోవడం మొదటి తప్పని చెబుతుంది. ఈ మరణాలకు సీఎస్ జవహార్ రెడ్డి, సీఎం పేషీలోని ధనుంజయరెడ్డి, ఫైనాన్స్ సెక్రటరీ కారణమని ఆరోపిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఖజానా ఖాళీ అయినందునే పింఛన్లు అందించలేకపోయారని విమర్శిస్తున్నారు. పింఛన్ల పంపిణీ తేదీ ముందే తెలిసినా ఎందుకు డబ్బులు డ్రా చేయలేదని ప్రశ్నిస్తున్నారు.

అంతేకాదు సీఎస్ చేతగాని తనం కూడా ఈ మరణాలకు కారణమని చెబుతున్నారు. పింఛన్ పంపిణీకి జారీ చేసిన ఆదేశాలను అధికారులు ఫాలో అవ్వలేదని టీడీపీ ఆరోపిస్తోంది. కేట‌గిరీల వారీగా పెన్ష‌న్ల పంపిణీకి విధివిధానాలు జారీ అయ్యాయి. కొంత‌మందికి ఇంటివ‌ద్ద పెన్ష‌న్ న‌గదు పంపిణీ జరుగుతుంది. మిగిలిన వారికి గ్రామ‌,వార్డు స‌చివాల‌యాల వ‌ద్ద పంపిణీకి ఏర్పాట్లు చేశారు. దివ్యాంగులు, తీవ్ర అనారోగ్యంతో బాధ‌ప‌డేవారు, అస్వ‌స్థ‌త‌కు గురైన‌వారు, మంచాన‌ప‌డ్డవారు, వృద్ద వితంతువుల‌కు ఇంటివ‌ద్ద పంపిణీ చేయాల‌ని ప్రభుత్వం నిర్ణ‌యించింది. గ్రామ స‌చివాల‌యాల‌కు చాలా దూరంగా ఉన్న వారికోసం ప్ర‌త్యేక ఏర్పాట్లు చేయాల‌ని కలెక్ట‌ర్ల‌కు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

దివ్యాంగులు, తీవ్ర అనారోగ్యంతో బాధ‌ప‌డేవారు, అస్వ‌స్థ‌త‌కు గురైన‌వారు, మంచాన‌ప‌డ్డవారు, వృద్ద వితంతువుల‌కు ఇంటివ‌ద్ద పంపిణీ చేయాల‌నే నిబందన ఉన్నప్పటికీ ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. దీంతో.. వృద్దులు వడదెబ్బ తగిలి మృతి చెందుతున్నారు. సీఎస్, వైసీపీ నేతలకు కూడా కావాల్సింది అదేనని టీడీపీ ఆరోపిస్తోంది. వృద్ధులు చనిపోతే శవరాజకీయాలు చేయొచ్చని ప్లాన్ చేశారని ఆరోపిస్తున్నారు. అందుకే సీఎస్ పై చర్యలు తీసుకోవాలని ఈసీకి ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో.. ఈసీ ఆయనపై చర్యలు తీసుకునే పరిస్థితి కనిపిస్తుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -