TDP: ఆ 4 నియోజకవర్గాలలో అభ్యర్థులను మారుస్తున్న టీడీపీ.. మార్పుతో గెలుపు ఖాయమా?

TDP: మే 13వ తేదీ ఏపీ సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా మే 13వ తేదీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ప్రచార కార్యక్రమాలు కూడా మొదలయ్యాయి. అలాగే కొంతమంది అభ్యర్థులు నామినేషన్ కూడా దాఖలు చేశారు. ఇలా నామినేషన్స్ ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు నాలుగు నియోజకవర్గాలలో అభ్యర్థులను మార్చే ఆలోచనలో ఉన్నారని తెలుస్తుంది.

ప్రస్తుతం నర్సాపురం ఎంపీగా ఉన్నటువంటి రఘురామకృష్ణం రాజుకు ఉండి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ దాదాపు కన్ఫర్మ్ అయిందని తెలుస్తోంది. ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా కేటాయించిన రామరాజులును బుజ్జగించి ఆయనకు ఏదో ఒక పదవి ఇస్తానని బాబు మాట ఇచ్చారట. అనకాపల్లి జిల్లా మాడుగుల నుంచి బండారు సత్యనారాయణమూర్తి ప్రచారం ప్రారంభించారు.

మొదట పైలా ప్రసాదరావుకు టికెట్ కేటాయించింది. కానీ.. సర్వేలో ఆయన వెనుక ఉండడంతో సత్యనారాయణమూర్తికి మాడుగుల సీటు లభించింది.సత్యసాయి జిల్లా మడకశిర లోనూ అభ్యర్థిని మార్చాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. దళిత విభాగ రాష్ట్ర అధ్యక్షుడైన ఎంఎస్ రాజును బరిలోకి నిలపాలనుకుంటున్నారు.

ఈయనతో పాటు తంబళ్లపల్లె అభ్యర్థి జయచంద్రారెడ్డిని కూడా టీడీపీ మార్చే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఇలా నలుగురు అభ్యర్థులను మార్పు విషయం గురించి ఎప్పుడైనా ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -