Chandrababu Naidu: చంద్రబాబు మాటలను పట్టించుకోని నేతలు… ఎవరికి వాళ్లే

Chandrababu Naidu: ఏపీలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశముందనే ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వ పథకాలు అమలు చేయడానికి డబ్బులు లేకపోవడం, వైసీపీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరుగుతున్న క్రమంలో సీఎం జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. తాజాగా గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ను సీఎం జగన్ కలిశారు. ముందస్తు ఎన్నికల కోసమే గవర్నర్ ను కలిశారనే చర్చ జరుగుతోంది. అసెంబ్లీని రద్దు చేసిన తర్వాత గవర్నర్ సంతకం పెట్టాల్సి ఉంటుంది. అసెంబ్లీ రద్దు అయినట్లు గవర్నర్ నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో ముందస్తు ఎన్నికలు జరపడం, అసెంబ్లీ రద్దుపై గవర్నర్ తో చర్చించారనే ప్రచారం జరుగుతోంది.

తన సతీమణి భారతితో కలిసి గవర్నర్ ను జగన్ కలిశారు. అయితే ఏపీలో ముందస్తు ఎన్నికలు వస్తాయనే ప్రచారం ఎప్పటినుంచో జరుగుతోంది. గడపగడపకు మన ప్రభుత్వం పేరుతో వైసీపీ నేతలు ఇంటింటికి తిరిగి ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళుతుండటం, పార్టీ పరంగా నేతలతో జగన్ సమీక్ష సమావేశాలు జరుపుతుండటం, మూడు రాజధానుల ఉద్యమాన్ని వైసీపీ తెరపైకి తీసకొచ్చి స్పీడ్ పెంచడం చర్చనీయాంశంగా మారింది. మూడు రాజధానులకు వ్యతిరేకంగా అవసరమైతే రాజీనామా చేసేందుకు సిద్దంగా ఉన్నామంటూ ఉత్తరాంధ్ర వైసీసీ నేతలు చెబుతున్నారు. మూడు రాజధానుల రిఫరెండెంగానే ఎన్నికలకు వెళతామంటూ చెబుతున్నారు.

దీంతో ఏపీలో ముందస్తు ఎన్నికలపై మళ్లీ చర్చ జరుగుతోంది. జగన్ కు దమ్ముంటే ఇప్పటికప్పుడు అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు రావాలని ఇటీవల ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సవాల్ విసిరారు. మూడు రాజధానుల రిఫెరెండంగా వైసీపీ ఎన్నికలకు రావాలని, తాము అమరావతి రాజధానిగా డిమాండ్ చేస్తూ ఎన్నికలకు వస్తామని తెలిపారు. వైసీపీ గెలిస్తే మూడు రాజధానుల నిర్ణయానికి సెల్యూట్ చేస్తామంటూ అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఇక చంద్రబాబు కూడా టీడీపీ నేతలకు ఎప్పటినుంచో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశముందని చెబుతున్నారు.ఎన్నికలకు సిద్దంగా ఉండాలని శ్రేణులకు సూచిస్తున్నారు.

నియోజకవర్గాల వారీగా ఇంచార్జ్ లతో ఏకాంతంగా భేటీ అవుతున్నారు. వారి మైనస్ లను చెబుతూ సరిదిద్దుకోవాలని సూచిస్తున్నారు. ఎప్పుడూ ప్రజల్లోనే తిరుగుతూ ఉండాలని ఇంచార్జ్ లకు సూచించారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ టికెట్లను కేటాయిస్తూ ఇప్పటికే చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఇక ఇంచార్జ్ లను వ్యక్తిగతంగా కలుస్తూ టికెట్ కేటాయింపుపై క్లారిటీ ఇస్తున్నారు. గెలుపొందే అభ్యర్థులకు టికెట్ ఇస్తానని, పనిచేసుకుంటూ పోవాలని సూచిస్తున్నారు. అయితే కొంతమంది నేతలు ఇంకా ప్రజల్లో తిరగపోవడంపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

కొంతమంది టీడీపీ నేతలు ఇంకా నిర్లక్ష్యంగానే ప్రవర్తిస్తున్నారని చంద్రబాబు గుర్తించారు. ఇలా అయితే కుదరదని వారిని మందరించినట్లు తెలుస్తోంది. ఇప్పటికీ బయటకు వచ్చి ప్రజల్లో తిరగకపోతే వచ్చే ఎన్నికల్లో మళ్లీ ప్రతికూల ఫలితాలు వచ్చే అవకాశముందని, నేతలందరూ ఎప్పుడూ ప్రజల్లో ఉండాలని చంద్రబాబు సూచించారు. అయినా టీడపీ నేతలు మాత్రం బాబు మాటలను లైట్ తీసుకకున్నారు. రాజధానికి మద్దతుగా అమరావతి రైతలు పాదయాత్ర చస్తున్నారు. కానీ అమరావతి రైతుల పాదయాత్రకు మాత్రం టీడీపీ నేతలు మద్దతు తెలపడం లేదు.

వారికి కలిసి సంఘీభావం ప్రకటించడం లేదు. కొంతమంది టీడీపీ నేతలు మాత్రమే వారి పాదయాత్రలో పాల్గొని మద్దతు తెలుపుతున్నారు. అమరావతి రైతుల పాదయాత్రకు వ్యతిరేకంగా వైసీపీ నతలు చేస్తున్న వ్యాఖ్యలకు కౌంటర్లు ఇస్తున్నారు. కొంతమంది టీడీపీ నేతలు మాత్రం అసలు స్పందించడం లేదు. ఇంట్లో నుంచి బయటకు రావడం లేదు. దీంతో వారిక చంద్రబాబు హెచ్చరికలు జారీ చేసినట్లు తెలస్తోంది. తీరు మార్చుకోకపోతే వచ్చే ఎన్నికల్లో టికెట్ కష్టమేనంటూ చెప్పిన్లు ప్రచారం జరుగుతోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -