Roja: జగన్ ఎంత ప్యాకేజీ ఇచ్చారో రోజా చెప్పాలి.. టీడీపీ ఫ్యాన్స్ సంచలన వ్యాఖ్యలు వైరల్!

Roja: ప్రస్తుతం ఏపీలో ఒక ప్రశ్న ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తుంది. అదేమిటంటే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది రాష్ట్ర భవిష్యత్తును మెరుగుపరచడానికా లేకపోతే భవిష్యత్తుని అంధకారం లోకి నెట్టడానికా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నాయకులకు ప్రజల పట్ల బాధ్యత లేదు. అలాగే మంత్రులకు శాఖల పట్ల అవగాహన లేదు. అధినేతకు పాలన పట్ల ఆసక్తి లేదు. విపక్షాల మీద విరుచుపడడమే వారి శాఖ పని అన్న విధంగా వ్యవహరిస్తున్నారు సదరు మంత్రులు. రాష్ట్ర పర్యటక శాఖా మంత్రి రోజాకు అటు మెయిన్ స్ట్రీమ్ మీడియా లోను,ఇటు సోషల్ మీడియా వేదికగా గట్టి కౌంటర్లు పేలుస్తున్నారు జనసేన నేతలు.

చంద్రబాబు అరెస్టును ఖండించి ఆ అరెస్టుకు నిరసనగా టీడీపీ నిర్వహిస్తున్న బందుకు జనసేన అధినేత పవన్ తన పార్టీ మద్దతు తెలిపారు. శాంతియుతంగా నిరసన కార్యక్రమాలలో పాల్గొనాలి అంటూ జనసైనికులకు పిలుపునిచ్చారు. రెండు పార్టీల మూకుమ్మడి నిరసనలతో కంగుతిన్న వైసీపీ యదావిధిగా మీడియా ముందుకి వచ్చి తమ నోటికి పనిచెప్పారు. అవినీతి కేసుల్లో జైలుకు వెళ్లిన ఒక సన్నాసి కోసం ఒక దరిద్రుడు మద్దతు పలికాడు అంటూ పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేసి బూతులతో రెచ్చిపోయింది. బాబు దగ్గర ప్యాకేజీ కోసమే ఈ డ్రామాలు సొంత పుత్రుడి కంటే దత్తపుత్రుడి హడావిడి ఎక్కువైంది అంటూ రెచ్చిపోయారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ ను ప్యాకేజీ స్టార్ దత్తపుత్రుడు అంటూ నోటికొచ్చిన విధంగా వాగింది.

అలా తాజాగా రోజాగా అధికార పార్టీ అని రెచ్చిపోతూ చంద్రబాబు పైనా ఇటు పవన్ పైనా హద్దులు దాటి మాట్లాడారు. ఈ విమర్శల మీద స్పందిస్తున్న జనసేన నేతలు ఒక్క కేసులో రిమాండ్ కు వెళ్లిన బాబుకి మద్దతు పలికితేనే ప్యాకేజీ అంటూ వాగుతున్న నువ్వు 32 కేసులలో A1 ముద్దాయిగా ఉండి బెయిల్ మీద తిరుగుతున్న జగన్ మోహన్ రెడ్డిని సమర్దిస్తున్నందుకు జగన్ మీఅందరికి ఎంత ప్యాకేజీ ఇస్తున్నారో ముందు చెప్పాలి అంటూ రోజా పై విరుచుకుపడుతున్నారు. చంద్రబాబూ మీద పెట్టిన కేసులు నిజమైతే జగన్ మీద ఉన్న కేసులు వాస్తవమే అని ఒప్పుకోండి. అలా చూసినా చంద్రబాబు ఆరోపణలు ఎదుర్కొని రిమాండ్ కు మాత్రమే వెళ్లారు. కానీ జగన్ 16 నెలలు జైల్లో గడిపొచ్చారు. మరి దాని సంగతేంటి అంటూ నిలదీస్తున్నారు జనసేన నేతలు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ పై జరిగిన కోడికత్తి దాడికి గాను పవన్ మీ అధినేతకు మద్దతు పలికారు. మరి అప్పుడు జగన్ ఎంత ప్యాకేజీ ఇచ్చాడో పవన్ కి చెప్పాలంటూ అంటూ రోజా నోటికి తాళం వేశారు. అధినేత కింద అన్న కేసులు పెట్టుకొని ఇష్టం వచ్చినట్లు మాట్లాడి తనతో పాటు జగన్ కు కూడా చిక్కులు తెస్తున్నారు వైసీపీ నేతలు. వారి అత్యుత్సహం వలన పోయేది జగన్ పరువే అనేది ఎప్పటికి గుర్తిస్తారో ఈ వైసీపీ మంత్రులు నాయకులు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -