Ghaziabad: స్కూటీపై ఆ పని చేసిన జంట.. వద్దు అన్నందుకు?

Ghaziabad: సమాజంలో జరిగే కొన్ని రకాల సంఘటనలు చూస్తే మనుషులు ఇంత దారుణానికి ఒడిగడతారా ఇంత దారుణంగా దిగజారిపోయి ప్రవర్తిస్తారా అనిపిస్తూ ఉంటుంది. ఇక మనుషుల్లో అయితే మానవత్వం అన్నది మంట కలిసిపోయింది. ఎదుటి వ్యక్తిని దారుణంగా కొట్టి హింసించి చంపి రాక్షస ఆనందం పొందుతున్నారు. కొన్ని ప్రదేశాల్లో అయితే తప్పు చేసిన వారిని ప్రశ్నించడం కూడా శాపంగా మారుతుంది. తాజాగా అటువంటి ఘటన ఒకటి ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకుంది. తప్పు చేస్తున్నారు అని నిలదీసినందుకు ఇద్దరు యువకులను చంపేశారు. అసలేం జరిగిందంటే..

 

ఉత్తర్​ప్రదేశ్​లోని ఘజియాబాద్​లోని సాహిబాబాద్​లో మనీష్ కుమార్ అనే వ్యక్తి ఒక మహిళతో స్కూటీపై వెళ్తూ బండి పైనే ముద్దులు పెట్టుకున్నారు. దీంతో అటువైపుగా మరో వాహనదారుడు 27 ఏళ్ల విరాట్ మిశ్రా అనే వ్యక్తి వారిని వారించాడు. పబ్లిక్ లో అలా చేయకూడదు అని వారించాడు. దీంతో ఆగ్రహానికి గురైన మనీష్ కుమార్.. తన ఫ్రెండ్స్​ను అక్కడికి పిలిపించాడు. అక్కడికి చేరుకున్న అతడి ఫ్రెండ్స్ విరాట్ మీద దాడికి దిగారు. ఇటుకలు, కర్రలతో అతడిని చితకబాదారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన విరాట్ మిశ్రాను ఆస్పత్రికి తరలించినా కూడా లాభం లేకుండా పోయింది. అయితే అప్పటికే అతడు ప్రాణాలు కోల్పోయాడు.

విరాట్ మిశ్రాపై మనీష్ ఫ్రెండ్స్​ దాడికి తెగబడ్డ సమయంలో అతడ్ని కాపాడేందుకు అక్కడికి వెళ్లిన బంటీ అనే వ్యక్తినీ కూడా తీవ్రంగా కొట్టారు. లైటర్ గాయపడిన మిశ్రాను స్థానిక ఆస్పత్రికి తీసుకువెళ్లగా గాయాలు ఎక్కువగా ఉండటంతో అక్కడి నుంచి ఢిల్లీకి తరలించారు. కానీ ట్రీట్​మెంట్ పొందుతూ మిశ్రా ప్రాణాలు వదిలాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మనీష్ కుమార్, మనీష్ యాదవ్, గౌరవ్ కసనా, ఆకాష్ కుమార్, పంకజ్ సింగ్, విపుల్ కుమార్​లను నిందితులుగా గుర్తించారు. ఆ ఆరుగుర్ని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: అవినాష్ రెడ్డి ఏ తప్పు చేయలేదా.. అలా అయితే హత్య చేసిందెవరో చెప్పు జగన్?

CM Jagan:  ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల పులివెందులలో నిర్వహించినటువంటి సభలో వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. చిన్నాన్న వివేకం బాబాయ్ కి...
- Advertisement -
- Advertisement -