Ghaziabad: భర్త ఫ్రెండ్‌తో సరసాలు.. రెండ్‌ హ్యాండ్‌కు పట్టుకోవడంతో హత్య!

Ghaziabad: అక్రమ సంబంధాలు పచ్చని కాపురాల్లో చిచ్చులు రేపుతున్నాయి. వయస్సు వచ్చిన పిల్లలు ఉన్నా కూడా కొందరు వివాహేతర సంబంధాలకు తెర లేపుతున్నారు. ప్రస్తుతం కొందరు స్త్రీలు కూడా అక్రమ సంబంధాల జోలికి వెళ్లి తన కుటుంబాన్ని బజారుకు ఈడ్చుకుంటున్నారు. యవ్వవస్తులే కాక దాదాపు యాభై ఏళ్ల మహిళలు సైతం ఇలాంటి దుశ్చర్యాలకు పాల్పడుతున్నారంటే సమాజం ఎటువైపు వెళ్తోందో అర్థమవ్వడం లేదని విశ్లేషకులు ముక్కున వేలేసుకుంటున్నారు.

కొందరు మహిళలు అక్రమ సంబంధాల మోజులో పడి శరీర సుఖం కోసం జీవితాంతం రక్షణగా ఉంటానని మాటిచ్చి కట్టుకున్న భర్తకు పంగనామాలు పెట్టి మరోకరితో పరార్‌ అవుతున్నారు.దాదాపుగా 42 ఏళ్ల ఓ మహిళ తన భర్త స్నేహితుడితో వివాహేతర సంబంధాన్ని నడిపి, భర్తకు దొరికిపోయిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఝజియాబాద్‌లో చోటు చేసుకుంది. ఝజియాబాద్‌కు చెందినసునీల్‌( 45), దీపా (42) భార్యాభర్తలు వీరికి చాలా ఏళ్ల కిందటే వివాహం జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు సంతానం. రెండేళ్ల క్రితం వారి కూతురుకి సైతం పెళ్లి జరిపించారు. కాగా.. సునీల్‌ స్నేహితుడైన రవి అనే వ్యక్తి తరచూ సునీల్‌ ఇంటికి వస్తుండేవాడు. ఈ క్రమంలో దీపాకు రవికి ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 10 పదేళ్లుగా వీరి వివాహేతర సంబంధం కొనసాగుతున్నట్లు తెలిసింది. పదేళ్లలో భర్తకు తన చీకటి కోణం తెలియకుండా జాగ్రత్త పడుతూ వచ్చారు.

సునీల్‌ ఇంట్లో లేపప్పుడల్లా దీపా రవిని ఇంటికి పిలిపించుకుని రోమాన్స్‌ చేసుకునేవారు. ఇటీవల సునీల్‌ ఇంట్లో లేనప్పుడు రవిని ఇంటికి రమ్మ తెగ ఎంజాయ్‌ చేశారు. ఇద్దరు కలిసి ఓకే బెడ్‌పై ఉండగా సునీల్‌ ఇంట్లోకి రాగానే పరాయి వ్యక్తితో తన భార్య నగ్నంగా ఉండటం చూసి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. కట్టలు తెంచుకున్న కోపంతో సునీల్‌ ఇద్దరిని కర్రతో దాడి చేసే ప్రయత్నం చేశాడు. ఈ ప్రయత్నంలోనే సునీల్‌ చేతిలో ఉన్న కర్రను దీపా రవి లాక్కుని సునీల్‌పై ఎదురుదాడికి దిగారు. సునీల్‌కు బాగా దెబ్బలు తగలడంతో అక్కడికక్కడే కుప్పకూలి చనిపోయాడు. ఆ తర్వాత భర్త శవాన్ని ఓ సంచిలో కట్టి రెండ్రోజులుగా ఇంట్లోనే పెట్టింది. ఆ తర్వాత శవం నుంచి దుర్వాసన రావడంతో ఓ పొలంలో విసిరేశారు. గుర్తించిన స్థానికులు తమదైన శైలిలో విచారించగా ఇద్దరు కలిసి హత్యచేసినట్లు ఒప్పుకోవడంతో ఇద్దరిని జైల్‌కు పంపించారు.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -