Love Vs Attraction: ప్రేమకు, ఆకర్షణకు ఉన్న తేడాలేంటి? ఎలా గుర్తించాలి?

Love Vs Attraction: చాలామందికి ప్రేమకు, ఆకర్షణకు ఉన్న తేడా ఏంటనే విషయంలో క్లారిటీ ఉండదు. మరీ ముఖ్యంగా టీనేజర్లకు ఏది ప్రేమో, ఏది ఆకర్షణో అర్థం కాక సందిగ్దంలో ఉంటారు. మరి ప్రేమలో ఉంటే ఎలా ఉంటుంది, ఆకర్షణకు లోనైతే ఎలా ఉంటందనే విషయంలో మీకు స్పష్టతనిచ్చే ప్రయత్నం ఈ ఆర్టికల్ చేస్తుంది. కాబట్టి ఆర్టికల్ ని జాగ్రత్తగా చదవండి.

ప్రేమలో ఉంటే ఎదుటి వ్యక్తి విషయంలో వారి ఆనందానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అలాగే వారి ఆనందం కోసం దేనినైనా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉంటారు. కానీ ఒకవేళ ఆకర్షణ ఉంటే మాత్రం అవతలి వ్యక్తిని కంట్రోల్ చేయాలని చూస్తారు. అలాగే ఆ వ్యక్తి విషయంలో ఈర్ష్యను, కోల్పోతారేమో అనే భయాన్ని కలిగి ఉంటారు.

ఎవరి మీదైనా ఆకర్షణ కలిగి ఉంటే ఆ వ్యక్తిని సొంతం చేసుకోవాలని ఎలాగైనా ప్రయత్నిస్తూ ఉంటారు. వారి ఇష్టాలతో పని లేకుండా వారిని దక్కించుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ ఒకవేళ అవతలి వ్యక్తి మీద ప్రేమ ఉంటే ఆ వ్యక్తి మీకు దక్కకపోతే, వదిలేస్తారు. మీకు కావాల్సిన వ్యక్తి మీ జీవితంలోకి వచ్చిన తర్వాత మీ ఆనందంగా తగ్గుతూ వస్తే ఆ వ్యక్తి మీద మీకు ఆకర్షణ ఉందని అర్థం. అలా కాకుండా మీ జీవితంలోకి వచ్చాక ఆనందం పెరిగితే మీకు ప్రేమ ఉన్నట్లు అర్థం.

ఇక మనకు కావాల్సిన వ్యక్తి బ్రేకప్ చెబితే, సదరు వ్యక్తి మీద పగ పెట్టుకుంటే వారి మీద మీకు ఉన్నది ఆకర్షణ అని గుర్తించుకోవాలి. అలా కాకుండా వారు బ్రేకప్ చెబితే మీరు బాధపడితే ఆ వ్యక్తి పట్ల మీకు ప్రేమ ఉన్నట్లు అర్థం. అలాగే మీరు కోరుకున్న వ్యక్తి ఆనందం కోసం ఏదైనా చేసేలా ప్రేమ చేస్తుంది కానీ ఆ వ్యక్తిని ఎలాగైనా దక్కించుకోవాలనే కోరిక ఉంటే అది ఖచ్చితంగా ఆకర్షణ.

Related Articles

- Advertisement -

ట్రేండింగ్

Pawan Kalyan: పవన్ కు ఎక్కువ సీట్లు ఇచ్చే ఆలోచన లేదా.. ఏం జరిగిందంటే?

Pawan Kalyan: ఏపీలో తాజాగా జరిగిన పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఏపీలో ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా తెలుగుదేశం పార్టీ హవానే...
- Advertisement -