Girls like it: అమ్మాయిలు ఎక్కువగా ఎలాంటి వారికి ఇష్టపడుతారో తెలుసా?

Girls like it: ప్రస్తుత కాలంలో ప్రేమ అనే పదం చాలా విషయాలకు మూలస్తంభంగా మారింది.. కొంతమంది అబ్బాయిలు కొంత మంది అమ్మాయిల వెంటపడుతూ వారి మనసు గెలుచుకోవడం కోసం శతవిధాల ప్రయత్నాలు చేస్తారు. ఒక్కోసారి వీళ్లు ఎంత ట్రై చేసినా ఆ అమ్మాయి వీరి ప్రేమను అంగీకరించదు. దీంతో అబ్బాయిలు చాలావరకు బాధపడుతూ ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు అనేకం ఉన్నారు.. అయితే కొంతమంది అమ్మాయిలు ముందుగా లవ్ చేసిన వారిలో కొన్ని లక్షణాలను బట్టి అవి నచ్చక ప్రారంభంలోనే విడిపోతున్నారు. ముఖ్యంగా అమ్మాయిలు అబ్బాయిల్లో ఇలాంటి లక్షణాలు ఉంటే ప్రపోజ్ చేస్తారట.

ఆత్మవిశ్వాసం: ఆత్మవిశ్వాసం లేనటువంటి అబ్బాయిలకు అమ్మాయిలు చాలా దూరంగా ఉంటారు.. కనీసం వారి మనసులో మాట కూడా చెప్పలేని అబ్బాయిలని ఇష్టపడరు. అలాంటి అబ్బాయిలు జీవితాంతం బాధపడుతుంటారు. అబ్బాయిలు ఏ నిర్ణయమైనా సరిగ్గా తీసుకోలేకపోతే అమ్మాయిలకు నచ్చరు.

పరిశుభ్రత: కొంతమంది అబ్బాయిలు శుభ్రతను పాటించరు.. ముఖ్యంగా అబ్బాయిల్లో అమ్మాయిలు చూసేది పరిశుభ్రత. పరిశుభ్రంగా ఉండే అబ్బాయితో స్నేహం చేయడం కోసం ప్రాధాన్యం ఇస్తారు. స్నానం చేయకపోవడం, షేవింగ్ చేసుకోకపోవడం, పళ్లు శుభ్రంగా ఉంచుకోకపోవడం, బట్టలు సరిగా ఉండకపోవడం వంటి లక్షణాలు ఉంటే ఆ అబ్బాయిలను దూరంగా పెడతారు.

శరీరాకృతి: చాలామంది అమ్మాయిలు ఫిట్ గా ఉండే అబ్బాయిలను ఇష్టపడతారు. తను ప్రేమించే వ్యక్తి శరీరాకృతి బాగుండాలని కోరుకుంటూ ఉంటారు. ప్రతి అమ్మాయి అబ్బాయిల్లో ఇలాంటి లక్షణాలను గమనిస్తూ ఉంటారు.

గౌరవించడం: కొంతమంది అబ్బాయిలు పెద్దవారిని, స్త్రీలను చాలా చులకనగా తీసేస్తారు.. అలాంటి అబ్బాయిలను అమ్మాయిలు పట్టించుకోరు. పెద్దలు, స్త్రీలను గౌరవించే అబ్బాయిలంటే స్త్రీలు ఎక్కువగా ఇష్టపడి, వారి కోసం ఏదైనా చేయడానికి వెనకాడరు.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -