Mrunal Thakur: ఆ హీరోతో మృణాల్ నిజంగానే ప్రేమలో ఉందా.. ఏం జరిగిందంటే?

Mrunal Thakur: మృణాల్ ఠాకూర్ పరిచయం అవసరం లేని పేరు బాలీవుడ్ నటిగా పలు బాలీవుడ్ సినిమాలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈమె సీతారామం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మొదటి సినిమాతోనే ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి మృణాల్ కొంతకాలం పాటు ఎలాంటి సినిమాలకు కమిట్ అవ్వలేదు. అయితే ఈమెకు వరుస అవకాశాలు వచ్చినప్పటికీ కథ ప్రాధాన్యత ఉన్న సినిమాలను మాత్రమే ఎంపిక చేసుకున్నారు.

ప్రస్తుతం ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలలో నటిస్తున్నారు. ఇప్పటికే విజయ్ దేవరకొండ నాని వంటి హీరోల సరసన నటించే అవకాశాన్ని అందుకున్నారు. ఇవే కాకుండా మరో రెండు సినిమా కథలను కూడా వింటున్నారని త్వరలోనే వీటికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ విధంగా పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నటువంటి ఈమె పెళ్లయిన హీరో ప్రేమలో పడ్డారంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

ఈ విధంగా మృణాల్ ఠాకూర్ నాని సరసన సినిమాలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే నాని ప్రేమలో పడ్డారు అంటూ ఓ వార్త సంచలనగా మారింది. మరి ఈమె నిజంగానే నాని ప్రేమలో పడ్డారా అనే విషయానికి వస్తే…ఈమె నానితో పాటు సినిమాలో నటిస్తూ ఉండటమే కాకుండా లొకేషన్ లో నాని ఇతరుల పట్ల చూపించే కేర్ అండ్ లవ్ కి ఫిదా అయ్యారట.

 

ఈ క్రమంలోనే పెళ్లంటూ చేసుకుంటే ఇలాంటి వ్యక్తినే చేసుకోవాలని భావించారు. ఇలా ఇతరుల పట్ల చాలా ప్రేమ, కేరింగ్ చూసుకునే వ్యక్తి తనకు కూడా భర్తగా రావాలని కోరుకున్నారట.ఇలాంటి వ్యక్తి భర్తగా రావాలని కోరుకోవడం మంచిదే కానీ నానినే తనకు భర్తగా రావాలని కోరుకుంటే మాత్రం నాని భార్య అంజన పరిస్థితి ఏంటి అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయంపై సోషల్ మీడియాలో ట్రోల్స్ ఎదురవుతున్నాయని చెప్పాలి.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -