Kavitha: మోదీపై సంచలన వ్యాఖ్యలు చేసిన కవిత.. ఏమన్నారంటే?

Kavitha: తాజాగా ఎమ్మెల్సీ కవిత దేశంలో నిరుద్యోగ రేటు 7.8శాతంగా ఉందని, యువతకు ఏటా 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తాము అని ఇచ్చిన హామీ ఏమైందంటూ కేంద్ర ప్రభుత్వాన్ని ఆమె నిలదీసింది. మోస పూరిత హామీతో దేశ యువతను కేంద్రంలోని భాజపా ప్రభుత్వం దగా చేసిందని కవితా విమర్శించారు. ఈ మేరకు ట్విటర్‌ వేదికగా భాజపా, ప్రధాని మోదీపై ఆమె విమర్శలు గుప్పించారు.


కేంద్రంలో ఖాళీగా ఉన్న 10 లక్షల ఉద్యోగాలు ఎప్పుడు భర్తీ చేస్తారని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు.

 

నిజమైన డిగ్రీ సర్టిఫికెట్లు ఉన్న వాళ్లకు దేశంలో ఉద్యోగాలు రావని కానీ, డిగ్రీ లేని వాళ్లకు మాత్రం దేశంలోనే అత్యున్నత ఉద్యోగం ఉందని మోదీని ఉద్దేశిస్తూ ఆమె పరోక్షంగా ట్వీట్‌ చేసింది. ప్రధాని మోదీ విద్యార్హతలకు సంబంధించి ఎలాంటి డిగ్రీలు చూపించాల్సిన అవసరం లేదని గుజరాత్‌ హైకోర్టు ఇటీవల తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే. అయితే, దీనిపై ప్రతిపక్షాలు తమదైన శైలిలో విమర్శలను గుప్పిస్తున్నాయి. ఈ తీర్పుతో ప్రధాని మోదీ విద్యార్హత విషయంలో అనుమానం మరింత పెరిగిందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ అన్నారు.

 

మోదీ విద్యావంతుడైతే పెద్ద నోట్ల రద్దు వంటి నిర్ణయాలు తీసుకుని ఉండకపోయేవారని విమర్శించారు. మోడీ డిగ్రీ సర్టిఫికెట్లపై తీవ్ర స్థాయిలో విమర్శలు నడుస్తున్నాయి. ఇదే విషయంపై విమర్శలు ఎక్కువగా విలువెత్తుతున్నాయి. మరి ముఖ్యంగా కవిత మోడీని ఉద్దేశించి చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో చాలామంది ఆమె చేసిన మద్దతుగా కామెంట్స్ చేస్తున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -