Modi-Jagan: విశాఖ రాజధాని అంటున్న వేళ జగన్‌ సర్కార్‌కు మోదీ భారీ షాక్.. ఏం జరిగిందంటే?

Modi-Jagan: ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం అధికారంలో ఉన్న వైయస్ఆర్సీపీ ప్రభుత్వం మూడు రాజధానులను ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే. అయితే దసరా పండుగ నుంచి రాష్ట్ర పాలన విశాఖ నుంచి జరుగుతుంది అంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పుకొచ్చారు. అయితే కొన్ని కారణాల వల్ల ఇది కాస్త ఆలస్యం అవుతుంది కానీ విశాఖ నుంచి పరిపాలన కొనసాగుతుందని మాత్రం జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు.

ఈ విధంగా విశాఖ రాజధాని అంటూ జగన్మోహన్ రెడ్డి అంటున్న సమయంలోనే కేంద్రం నుంచి జగన్మోహన్ రెడ్డికి కాస్త షాక్ తగిలింది అని చెప్పాలి. ఇప్పటివరకు విజయవాడలో పాస్ పోర్ట్ కార్యాలయం లేకపోవడంతో ప్రతి ఒక్కరు విశాఖ వెళ్లి పాస్ పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఉండేది ఈ సమయంలోనే కేంద్రం విజయవాడలో కూడా పాస్ పోర్ట్ కార్యాలయం ప్రారంభించబోతున్నట్లు ప్రకటించి అందరికి షాక్ ఇచ్చారు.

ఇప్పటి వరకు ప్రాంతీయ పాస్‌ పోర్టు కార్యాలయం లేకపోవటం వల్ల పాస్‌పోర్టుల ముద్రణ, డిస్పాచ్‌ అంతా విశాఖపట్నంలోనే జరుగుతోంది. కేంద్రం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తీసుకున్న నిర్ణయం మేరకు విజయవాడకు ఎట్టకేలకు ప్రాంతీయ కార్యాలయం మంజూరైంది. ఇలా పరిపాలన విశాఖ నుంచి ప్రారంభించాలని జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నా అటువంటి తరుణంలో కేంద్రం నుంచి ఈ విధమైనటువంటి ప్రకటన వెలువడటం గమనార్హం.

ఈ విధంగా విజయవాడలో కూడా ప్రాంతీయ పాస్ పోర్ట్ కార్యాలయం ఏర్పడటంతో ఇకపై విశాఖకు వెళ్లాల్సిన అవసరం కూడా ఏమాత్రం లేకుండా పోయింది. వచ్చే జనవరి నుంచి ఈ సేవలో ప్రారంభమవుతాయని రీజనల్‌ పాస్‌పోర్టు ఆఫీసర్‌ కె.శివహర్ష శనివారం విజయవాడలో విలేకరుల సమావేశంలో నూతన ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయ విశేషాలను మీడియాతో పంచుకున్నారు.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జనసేన పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ నేతలు పాటిస్తారా?

Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ లో ఇప్పుడు పరిపూర్ణ రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు. పార్టీకి సంబంధించి అనేకమైన కీలక నిర్ణయాలను చాలా పరిణితితో తీసుకుంటున్నారు. పోలింగ్ రెండు వారాల్లో ఉంది కాబట్టి ఈ...
- Advertisement -
- Advertisement -