Janasena: ఆ కారణాల వల్లే జనసేన అధినేత ఢిల్లీకి వెళ్లి వాళ్లను కలిశారా?

Janasena: జనసేన అధినేత ఢిల్లీ పర్యటనపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. ముందుగా మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన గణతంత్ర దినోత్సవ కార్యక్రమం లో పాల్గొన్నారు పవన్ కళ్యాణ్. ఈ సందర్భంగా మాట్లాడుతూ. రాజోలు, రాజానగరం సీట్లలో జనసేన పోటీ చేస్తుందనే విషయాన్ని వెల్లడించారు. అదేవిధంగా టీడీపీ పై తనకున్న అసంతృప్తిని వెళ్లగక్కారు.

 

తమకు చెప్పకుండానే సీట్లు కేటాయించుకోవడం, సీఎం సీటు విషయంలో వ్యాఖ్యలు చేయడం వంటివి పొత్తు ధర్మానికి విరుద్ధం అంటూ వ్యాఖ్యానించారు. ఆపై పార్టీ నాయకులతో రహస్యంగా భేటీ ఆయన పవన్ కళ్యాణ్ నెలాఖరులోగా పార్టీ తన అభ్యర్థులను ఖరారు చేస్తుందని చెప్పినట్లు సమాచారం. తదనంతరం ఆయన ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. శనివారం లేదా ఆదివారం బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ కాబోతున్నారని తెలిసింది.

ఈ సందర్భంగా ఏపీలో పొత్తులపై ఆయన ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారని జనసేన వర్గాలు చెప్తున్నాయి. ఇప్పటివరకు బీజేపీ వస్తుందని ఆశలతో ఉన్నామని అయితే ఆ పార్టీ ఏ విషయం తేల్చకపోవడంతో క్షేత్రస్థాయిలో టికెట్లపై నాయకులు దూకుడుగా ప్రవర్తిస్తున్న నేపథ్యంలో సహజంగానే పవన్ ఒత్తిడికి గురవుతున్నారు. మరోవైపు వైసీపీ సిద్ధం అంటూ పార్టీ మీటింగులు పెడుతూ, అభ్యర్థులను ఖరారు చేయడం లో తన దూకుడుని పెంచింది.

 

దీంతో ఆలోచనలో పడిన పవన్ బీజేపీ తో పొత్తు ఉంటే సీట్లు పంచుకునే అవకాశం ఉంటుందని లేకపోతే తమకు కలిసి వచ్చే పార్టీలతో కలిసి పవన్ పొత్తులు పెట్టుకొని ముందుకు సాగే అవకాశం ఉందని పార్టీ నాయకులు చెప్తున్నారు. ఏది ఏమైనా ఈ నెలాఖరు నాటికి తేల్చేయాలని ఉద్దేశంతోనే పవన్ ఢిల్లీ వెళ్లినట్లు సమాచారం. బీజేపీ తో పొత్తు కుదురుతుందని ఆశతోనే ఉన్నారు జనసేన వర్గం వారు . అలా కాని పక్షంలో టీడీపీ కమ్యూనిస్టులతో కలిసి ముందుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -