Dogs: కుక్క పళ్లను క్లీన్‌ చేయడానికి రూ. 5 లక్షలు ఖర్చు చేశాడు..

Dogs: నేటి కాలంలో మనుషులు, జంతువులు, పక్షులతో సత్సంబంధాలు బాగా పెరిగిపోతున్నాయి. కొందరు కుక్కలు, జంతువు, పక్షులను తమ కుటుంబ సభ్యులుగా భావిస్తూ వాటిని అతి జాగ్రత్తగా చేసుకుంటున్నారు. వాటికి సమయానికి భోజనం పెట్టడం, వాకింగ్‌లు సైతం చేయిస్తూ వాటి ఆరోగ్యంపై శ్రద్ధ చూపిస్తున్నారు. వాటికి అవి ఏమాత్రం అనారోగ్యానికి గురైనా తమ పనులను సైతం వదులుకుని ఆస్పత్రులకు తీసుకెళ్తుంటారు.

కొందరు అవి అస్సలు అనారోగ్యాలకు గురి కాకుండా ముందస్తు జాగ్రత్తలు పాటిస్తారు. సాధారణంగా కుక్కలు అనారోగ్యానికి గురైతే వందలో, వేలలో ఖర్చు అవుతోంది. కానీ.. ఓ వ్యక్తి మాత్రం తన కుక్కను ఆస్పత్రికి తీసుకెళ్లి ఏకంగా రూ. 5 లక్షలు ఖర్చుచేసి నెటిజన్లను ముక్కున వేలేసుకునేలా చేశాడు. అతడు ఖర్చుచేసిన తీరు సదరు వ్యక్తి ఇలా చెప్పుకొచ్చాడు

.‘‘ నా 12 ఏళ్ల కుక్కను దాని పళ్లను శుభ్రం చేయించడానికి వెట్‌ డాక్టర్‌ దగ్గరకు తీసుకెళ్లాను. అక్కడికెళ్లిన తర్వాత వైద్యుడు దాని పళ్లు క్లీన్‌ చేయటానికి ఓ ఇంజెక్షన్‌ వేశాడు. ఇంజక్షన్‌ చేసిన కొద్ది సేపటికి ఒక్కసారిగా నా కుక్క రంగు మారింది. అప్రమత్తమైన వైద్యులు వెంటనే కుక్క పళ్లను క్లీన్‌ చేయడం ఆపేశారు. ఆ తర్వాత కుక్కకు వివిధ రకాల టెస్ట్‌లు చేశారు. నా కుక్క కేన్సర్‌ బారిన పడిందేమో అని అనుమానం వారికి వచ్చింది.

ఆ అనుమానంతో కొన్ని పళ్లు పీకి లోపల ఉన్న కణితిని తొలగించారు. కణితిని పరీక్షల కోసం పంపారు. ఇలా పలు పరీక్షలు చేసే వరకు దాదాపుగా రూ. 5 లక్షల వరకు ఖర్చు అయింది. మా తల్లిదండ్రులు కుక్కనను వెటర్నరీ దగ్గరకు తీసుకెళ్లరు. ఎందుకంటే వారంత డబ్బులు పెట్టుకోలేరు. ఇక, మా అత్తామామల ఇంట్లోనే ఓ వెటర్నరీ డాక్టర్‌ ఉన్నాడు కాబట్టి వారికి పర్వాలేదు’ అని ఆ కుక్క యజమాని చెప్పుకొచ్చాడు. కుక్క పళ్లకు ట్రీట్‌మెంట్‌ చేసేందుకు రూ. 5 లక్షలు ఖర్చుచేసిన యజమానిపై నెటిజన్లు కొందరు పాజిటివ్‌ కామెంట్లు చేస్తే మరి కొందరు కోపంతో రగిలిపోతున్నారు.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -