Red Wine: దంతాలు గట్టి పడాలంటే ఈ వైన్‌ తాగాలట.. !

Red Wine: దంత సమస్యలు చాలా మందికి ఉంటుంది. పంటి నొప్పి వచ్చినప్పుడు తలెత్త బాధ భరించలేక నానా ఇబ్బందులు పడటంతో పాటు అనారోగ్యాలకు కూడా గురవుతారు. కొందరు దందా వైద్యులను సంప్రదిస్తే మరి కొందరు నాటువైద్యాన్ని నమ్ముతారు. కొన్ని సార్లు పంటి నొప్పికి నాటు వైద్యం చేసే క్రమంలో ఇతర పళ్లకు కూడా హానీ జరిగిన సంఘటనలు మనం చూస్తునే ఉంటాం. అయితే.. రెడ్ వైన్ కూడా దంతల నొప్పిని తగ్గిస్తుందట. రెడ్ వైన్ తాగడం తో గుండె, వివిధ రకాల కేన్సర్ల బారిన పడకుండా కాపాడబడుతుందని పలు పరిశోధనలో వెల్లడైంది.

తాజాగా జరిపిన అధ్యయనంలో దంత సంరక్షణలోను రెడ్ వైన్ ఉపయోగపడుతుందని ఇటలీలోని పేవియా విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకుల బృందం వెల్లడించింది. స్ట్రెప్టోకోకస్ మ్యూటెంస్ బ్యాక్టీరియాతో దంత సమస్యలు ఎక్కువగా వస్తాయని పరిశోధకులు పేర్కొన్నారు. చక్కెర ఎక్కువుగా తినడం ద్వారా దంతాలలోకి ఈ బ్యాక్టీరియా చాలా సులువుగా చొరబడుతుందన్నారు. చక్కెర తినేవారిలో ఈ బ్యాక్టీరియా ప్రవేశించి దంతాలకు రంధ్రాలు ఏర్పారుస్తుండటంతో త్వరగానే దంతాలు పాడైపోతాయని పరిశోధకులు వెల్లడించారు.

రెడ్ వైన్ తాగడం తో దంతాలు దృఢంగా ఉండడం తో పాటు తెల్లగా మెరిసిపోతాయట. ఆ వైన్‌లో ఉండే రసాయనాలు దంతాలకు హాని చేసే స్ట్రెప్టోకోకస్ మ్యూటెంస్ బ్యాక్టీరియాను నాశనం చేస్తుందని పరిశోధకులు తెలిపారు. దీనివల్ల రెడ్ వైన్ దంతాల్లోకి చేరే బ్యాక్టీరియాను అంతం చేస్తాయని పరిశోధనలో వెల్లడైనట్లు పరిశోధకులు వెల్లడిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

AP Roads: ఏపీలో రోడ్ల పరిస్థితిని చూపించి ఓట్లు అడిగే దమ్ముందా.. వైసీపీ నేతల దగ్గర జవాబులున్నాయా?

AP Roads:  ఒక రాష్ట్రం అభివృద్ధి బాటలో నడవాలి అంటే ముందుగా ఆ రాష్ట్రంలో మౌలిక సదుపాయాలన్నీ కూడా సక్రమంగా ఉండాలి మౌలిక సదుపాయాలు అంటే రోడ్లు కరెంట్ నీరు వంటి వాటివి...
- Advertisement -
- Advertisement -