Ram-Boyapati: రామ్ బోయపాటి మూవీ రిలీజ్ డేట్ మారిందిగా.. మూవీ రిలీజ్ అప్పుడే!

Ram-Boyapati: ఇస్మార్ట్ హీరో రామ్ పోతినేని ప్రస్తుతం యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. అయితే ఇప్పటివరకు ఈ సినిమా టైటిల్ ను రివీల్ చేయలేదు. అయితే ఈ సినిమా టైటిల్ విడుదల చేయడానికి ముహూర్తం ఖరారు చేసినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా టైటిల్ ఈనెల 28వ తేదీ ప్రకటించబోతున్నట్టు తెలుస్తుంది.

 

యాక్షన్ మూవీగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు తెలుస్తుంది. అయితే ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైనటువంటి పోస్టర్స్ సినిమాపై భారీ అంచనాలనే పెంచేసాయి. మరి ఈ సినిమాకు స్కంద అనే టైటిల్ ఖరారు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇలా ఈ సినిమా టైటిల్ ను 28వ తేదీ తెలియజేయనున్నారు. ఇక ఈ సినిమా విడుదల తేదీ కూడా పోస్ట్ పోన్ అయిందని తెలుస్తోంది.ముందుగా ఈ సినిమాని ఆగస్టు 11వ తేదీ విడుదల చేయాలని మేకర్స్ భావించారు అయితే ఆ సమయంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్నటువంటి భోళా శంకర్ విడుదల కాబోతోంది.

ఇలా మెగాస్టార్ చిరంజీవి సినిమా విడుదల కానున్న నేపథ్యంలో చేసేదేమీ లేక రామ్ వెనక్కి తగ్గారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈయన సెప్టెంబర్ 15వ తేదీ తన సినిమాని విడుదల చేయాలని భావించారట. ఈ సినిమా విడుదలైన 4 రోజులకే డిజె టిల్లు 2సినిమా కూడా విడుదల కాబోతోంది అయితే ఈ సినిమా బహుశా వాయిదా కూడా పడవచ్చు అయితే ఈ సినిమా వాయిదా పడిన లేకపోయినా సెప్టెంబర్ 15వ తేదీ మాత్రం స్కంద సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: జగన్ ను ముంచిన సలహాదారుడు అతనేనా.. వృద్ధాప్య పెన్షన్ విషయంలో ముంచింది ఎవరంటే?

CM Jagan: 2014 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యేసరికి రాష్ట్రంలో వృద్ధాప్య పెన్షన్ కేవలం 200 రూపాయలు మాత్రమే ఉండేది. చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే రూ. వెయ్యి చేశారు. మళ్లీ...
- Advertisement -
- Advertisement -