Ram: డబుల్ ఇస్మార్ట్ వల్ల ఆ హీరోయిన్లు నష్టపోయారా.. అసలేమైందంటే?

Ram: పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని నభనటేష్ నిధి అగర్వాల్ జంటగా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి చిత్రం ఇస్మార్ట్ శంకర్. ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుందో మనకు తెలిసిందే. వరుస ఫ్లాప్ సినిమాలను ఎదుర్కొంటున్నటువంటి పూరి జగన్నాథ్ ఈ సినిమా ద్వారా బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఇక ఈ సినిమా తర్వాత పూరి జగన్నాథ్ కూడా సరైన హిట్ అందుకోలేదు అలాగే రామ్ కూడా సినిమాలలో నటిస్తున్నప్పటికీ సరైన హిట్ మాత్రం ఏది పడలేదని చెప్పాలి.

పూరి జగన్నాథ్ ఈ సినిమాకు సీక్వెల్ చిత్రంగా డబుల్ ఇస్మార్ట్ శంకర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.ఇప్పటికే ఈ సినిమా పూజా కార్యక్రమాలను ఎంతో ఘనంగా జరుపుకోవడమే కాకుండా షూటింగ్ పనులు కూడా మొదలు పెట్టారని తెలుస్తోంది.ఇక డబుల్ ఇస్మార్ట్ కోసం పూరి జగన్నాథ్ ఇస్మార్ట్ శంకర్ సినిమా కోసం పని చేసిన టెక్నీషియన్స్ ని రిపీట్ చేయబోతున్నారని తెలుస్తుంది. అయితే హీరోయిన్స్ విషయానికి వస్తే మాత్రం పూరి జగన్నాథ్ కొత్తవారిని రంగంలోకి దింపబోతున్నట్లు సమాచారం.

 

ఈ సినిమా ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి నిధి అగర్వాల్,నభా నటేష్ అనంతరం ఎలాంటి సినిమాలలోను సక్సెస్ అందుకోలేదు నిజం చెప్పాలంటే వీరికి అవకాశాలు కూడా రాలేదు.దీంతో మరోసారి ఈ సినిమా ద్వారా సక్సెస్ అందుకోవాలని భావిస్తున్నటువంటి వారికి పూరి కాస్త షాక్ ఇచ్చారనే చెప్పాలి. ఈ సినిమాలో ఈ హీరోయిన్లకు బదులుగా బాలీవుడ్ స్టార్స్ అయినటువంటి సారా అలీ ఖాన్, శ్రద్ధ కపూర్ వంటి వారి పేర్లు తెరపైకి వచ్చాయి.

 

ఈ సినిమాని పూరి జగన్నాథ్ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలన్న ఉద్దేశంలో ఉన్నారట అందుకే బాలీవుడ్ ఇండస్ట్రీలో మార్కెట్ పరంగా ఆలోచించి ఈయన బాలీవుడ్ హీరోయిన్లను తీసుకోవాలని ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇదే కనుక జరిగితే నభా నటేష్, నిధి అగర్వాల్ ఇద్దరికీ అన్యాయం జరిగినట్లేనని చెప్పాలి. మరి త్వరలోనే ఈ విషయం గురించి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాబోతుందని తెలుస్తోంది

Related Articles

ట్రేండింగ్

CM Jagan: జగన్ ను ముంచిన సలహాదారుడు అతనేనా.. వృద్ధాప్య పెన్షన్ విషయంలో ముంచింది ఎవరంటే?

CM Jagan: 2014 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యేసరికి రాష్ట్రంలో వృద్ధాప్య పెన్షన్ కేవలం 200 రూపాయలు మాత్రమే ఉండేది. చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే రూ. వెయ్యి చేశారు. మళ్లీ...
- Advertisement -
- Advertisement -