Ram Puri: రామ్ పూరీ మూవీ బడ్జెట్ పెరుగుతోందా.. ఈ సినిమా హిట్టవ్వడం ఖాయమా?

Ram Puri: ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్క సినిమా కూడా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని సినిమాని నిర్మించే సమయంలోనే వివిధ భాషలలో స్టార్స్ సెలబ్రిటీలుగా గుర్తింపు పొందిన వారందరినీ కూడా ఒక సినిమాలో భాగం చేస్తున్నారు. ఇప్పటికే పలువురు ఇతర భాష సెలబ్రిటీలందరూ కూడా ఇతర భాషలలో సినిమాలు చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే పూరి జగన్నాథ సైతం తన సినిమాని పాన్ ఇండియా స్థాయిలోనే ప్లాన్ చేశారు.

పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండ కాంబినేషన్లో పాన్ ఇండియా స్థాయిలో లైగర్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి మనకు తెలిసిందే. ఇలా ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ సాధిస్తుందని ధీమా వ్యక్తం చేసినప్పటికీ ఈ సినిమా ఊహించని స్థాయిలో డిజాస్టర్ ఎదుర్కొని భారీ నష్టాలను మిగిల్చింది. ఈ సినిమా తర్వాత పూరి జగన్నాథ్ ఏడాది పాటు విరామం తీసుకుని రామ్ పోతినేని హీరోగా ఇస్మార్ట్ శంకర్ సినిమాకి సీక్వెల్ చిత్రంగా డబుల్ ఇస్మార్ట్ సినిమాని తెరకెక్కిస్తున్నారు.

 

ఈ సినిమాని కూడా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే ఇతర భాష సెలబ్రిటీలను కూడా ఈ సినిమాలో పూరి జగన్నాథ్ భాగం చేశారు.ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ పనులను జరుపుకోబోతుంది. ఈ క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..

 

ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో కేజిఎఫ్ సినిమాలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ను ఈ సినిమాలో తీసుకున్నారని తెలుస్తోంది.ఇక ఈ సినిమాలో నటించడం కోసం సంజయ్ దత్ ఏకంగా 10 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అడగడంతో పూరి జగన్నాథ్ అలాగే ఛార్మి కూడా ఆయన అడిగిన మొత్తంలో రెమ్యూనరేషన్ ఇచ్చి ఈ సినిమాలో భాగం చేయడానికి సిద్ధమయ్యారట ఇక ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో సినిమాపై భారీగానే అంచనాలు పెరిగిపోయాయి.

 

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జనసేన పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ నేతలు పాటిస్తారా?

Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ లో ఇప్పుడు పరిపూర్ణ రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు. పార్టీకి సంబంధించి అనేకమైన కీలక నిర్ణయాలను చాలా పరిణితితో తీసుకుంటున్నారు. పోలింగ్ రెండు వారాల్లో ఉంది కాబట్టి ఈ...
- Advertisement -
- Advertisement -