YSRCP: అప్పుడు కోట్ల రూపాయల డిమాండ్.. ఇప్పుడు బ్రతిమాలి టికెట్లు.. ఏపీలో వైసీపీ పరిస్థితి ఇంత ఘోరమా?

YSRCP: రండి బాబు రండి.. అయిపోతే దొరకవు.. త్వరగా త్వరపడండి అంటూ వ్యాపారులు ఏవైనా వస్తువులను అమ్ముతారు. అయితే, ఎంత గొంతు చిచ్చుకున్నా బిజినెస్ జరగనపుడు దాన్ని సంక్రాంతి ఆఫర్, దసరా ఆఫర్ అంటూ 10 పర్సంట్, 20 పర్సంట్ డిస్కౌంట్ ఇస్తారు. అప్పటికీ ప్రజలు ఆ వస్తువులను కొనకపోతే.. కొత్త దారులు వెతుకుతారు. బట్టలు అయితే కేజీలెక్క ఇచ్చేస్తారు. ఇప్పుడు ఎందుకు ఈ విషయం చెప్పాల్సి వస్తుందంటే.. వైసీపీ అధిష్టానం చేస్తున్న బిజినెస్ కూడా అలాగే ఉంది. ఇదేంటీ ఎన్నికల టైం బిజినెస్ చేయడమేంటీ అనుకుంటున్నారా? ఎన్నికలనే వైసీపీ బిజినెస్ చేసే ప్రయత్నం చేసింది. ఎమ్మెల్యే, ఎంపీ టికెట్ కావాలంటే కోట్లు కుమ్మరించాల్సిందే అని తేల్చి చెప్పింది. కొంతమంది ఆ రేటు చూసి షాక్ అయ్యి ఆశావహుల జాబితా నుంచి తప్పుకున్నారు. మరికొంతమంది వైసీపీ గ్రౌండ్ లెవెల్ లో ఉన్న వాస్తవాన్ని గ్రహించి సైలంట్ అయ్యారు. అయితే.. టికెట్ కోసం కోట్లు అడిగిన వైసీపీ అధిష్టానం మీరు పోటీ చేస్తే చాలు అనుకునే పరిస్థితి వచ్చేసింది.

మొదట్లో ఒంగోలు టికెట్ కు రూ. 140 కోట్లు డిమాండ్ చేశారు. ఒంగోలు కాదంటే నెల్లూరు తీసుకోండి కానీ.. రూ. 140 కోట్లు కట్టండని చెప్పారు. చెన్నైలో ఉండే ఓ వ్యాపారికి వైసీపీ అధిష్టానం మొదట చేసిన ఆఫర్ అది. అయితే.. రూ. 140 కోట్లు అంటే ఎలా అని తటపటాయించడంతో రూ. 120 కోట్లు అయినా అడ్జస్ట్ చేయండని చెప్పారు. కానీ.. ఆయన దానికి కూడా సాహసించకపోవడంతో.. బేరం రూ. 30 కోట్లకు కుదిరింది. అయితే.. రూ. 140 కోట్ల నుంచి రూ. 30 కోట్లకు వచ్చారంటే పరిస్థితి ఏదో తేడాగా ఉంది ఆ వ్యాపారి గ్రహించాడు. గెలిచే అవకాశం ఉంటే.. ఇంతగా తగ్గించేస్తారా? అని అనుకున్నాడు. ఇది మునిగే పడవలా కనిపిస్తుందని భావించి పోటీకి నో అనేశాడు. ఆయనే కాదు.. గత ఎన్నికల్లో పోటీకి పాకులాడిన వారంతా ఇప్పుడు సైలంట్ అయిపోయారు. అంతేకాదు.. పార్టీలు కూడా మార్చేశారు. ఒంగోలు ఎంపీ మాగుంట రాఘవ, నరసారావు పేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయులు, కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ వైసీపీ నుంచి టీడీపీలో చేరిపోయారు. అంతేకాదు.. నెల్లూరు లోక్‌సభ స్థానం నుంచి వైసీపీ తరుఫున పోటీ చేయాల్సిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా పార్టీకి గుడ్ బై చెప్పారు. ఎంపీలు, ఎంపీ అభ్యర్థులు పార్టీని వీడటంతో సీటుకి వంద కోట్లకు పైగా డిమాండ్ చేసిన వారు ఇప్పుడు పోటీ చేస్తే చాలని రిక్వస్ట్ చేస్తున్నారు.

మొదట ఆరు లోక్‌సభ స్థానాలపై పార్టీ పెద్దలు కృత్రిమంగా డిమాండ్ పెంచారు. ఆయా సీట్లకు పోటీ ఎక్కువగా ఉందని.. ఆశావహులు పోటీ పడుతున్నారని సిట్టింగులకే చెప్పారు. మీరు మళ్లీ అదేస్థానం నుంచి పోటీకి దిగాలంటే కనీసం మీ పరిధిలోని ఒక్క అసెంబ్లీ నియోజవర్గానికి రూ.20 కోట్లు ఖర్చు చేయాలని చెప్పారు. దీంతో.. ఒక ఎంపీ స్థానం కోసం ఇంత ఖర్చు అవసరమా అని చాలా మంది తప్పుకున్నారు. ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ పోటీకి దూరంగా ఉంటానని అన్నారు. విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఎమ్మెల్యేగా పోటీకి రెడీ అయ్యారు. మాగుంట శ్రీనివాస్ రెడ్డి పార్టీని వీడటంతో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఒంగోలులో పోటీకి దించారు. నెల్లురు ఎంపీ అభ్యర్థిగా ఉన్న వేమిరెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పడంతో గత్యంతరం లేక నెల్లూరు నుంచి విజయసాయిరెడ్డిని రంగంలోకి దించారు. నిజానికి వేమిరెడ్డి పోటికి సిద్దంగానే ఉన్నా.. ఆయనపై మరో రకమైన ఒత్తిడి పెంచారు. పోటీ చేస్తే సరిపోదు.. చంద్రబాబు, పవన్ ను వ్యక్తిగతంగా దూషించాలని అన్నారు. అయితే.. ఆయన దానికి నిరాకరించి పార్టీకి గుడ్ బై చెప్పారు. ఇక లావు శ్రీకృష్ణ దేవరాయులు పార్టీని వీడటంతో అనిల్ కుమార్ యాదవ్ ను బలవంతంగా నర్సారావుపేట నుంచి పోటీ చేయిస్తున్నారు. నాకు వద్దు బాబోయ్ ముర్రో అన్నా.. అమలాపురం ఎంపీ అభ్యర్థిగా రాపాక వరప్రసాద్‌ను రంగంలో దించారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -