Bangalore: మాజీ ప్రియురాలిని స్నేహితునికి అప్పగించిన లవర్.. ఆ తర్వాత ఏమైందంటే?

Bangalore: ఆన్లైన్ పరిచయాలకి బలైన మరో యువతి. మన చుట్టుపక్కల ఉన్నవాళ్లు బాగా తెలిసిన వాళ్ళే మనల్ని మోసం చేస్తున్న ఈ రోజుల్లో ఆన్లైన్లో పరిచయమైన అబ్బాయిలని నమ్ముతున్న ఆడపిల్లల అమాయకత్వానికి నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితి నెలకొంది. ఆన్లైన్ వ్యవహారాల గురించి ఆడపిల్లలకి పోలీసులు ఎంత అవగాహన కల్పిస్తున్నా ఆడపిల్లలు పెడచెవిన పెడుతున్నారు అనటానికి ఇలాంటి ఉదాహరణలే సాక్ష్యం.

ఇంతకీ ఏం జరిగిందంటే బెంగళూరుకు చెందిన ఒక యువకుడు తన మాజీ ప్రియురాలి పైశాచికత్వాన్ని ప్రదర్శించాడు. బెంగళూరులోని విద్యారణ్యపురకు చెందిన ఆండీ జార్జ్ అనే వ్యక్తి ఒక ప్రైవేట్ పాఠశాలలో డాన్స్ టీచర్ గా పని చేస్తున్నాడు. ఈశాన్య బెంగుళూరు కి చెందిన ఒక యువతితో 2 సంవత్సరాల క్రితం సోషల్ మీడియాలో అతనికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో వారు తరచూ కలుస్తూ ఉండేవారు. ఆ సమయంలో సరదాగా సెల్ఫీలు వీడియోలు తీసుకునేవారు సదరు ప్రేమికులు.

 

అయితే కొన్నాళ్ల తర్వాత జార్జ్ వ్యవహారంలో మార్పు రావడంతో అతన్ని దూరం పెడుతూ వచ్చింది ఆ యువతి. ఇది భరించలేకపోయినా జార్జ్ తన దగ్గర ఉన్న వీడియోలను ఫోటోలను చూపించి ఆ యువతని బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు. వాటిని ఎరగా వేసి ఆ అమాయకురాలి పై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతటితో అతని ఆవేశం చల్లారలేదేమో అతని స్నేహితులైన సంతోష్ శశి కుమార్ లతో కూడా సన్నిహితంగా ఉండాలని కోరాడు అయితే అందుకు అంగీకరించలేదు సదరు యువతి. అయితే ఏమాత్రం కనికరం చూపకుండా జార్జ్ మళ్ళీ తన దగ్గర ఉన్న ఫోటోలని చూపించి బ్లాక్ మెయిల్ చేశాడు.

 

తప్పనిసరి పరిస్థితులలో ఆ యువతి జార్జ్ స్నేహితుల దగ్గరికి కూడా వెళ్ళింది. ఆ సమయంలో వీడియోలు కూడా తీశాడు జార్జ్. ఇందుకుగాను ఆ దుర్మార్గుడు తన స్నేహితుల దగ్గర నుంచి డబ్బులు కూడా వసూలు చేశాడు. కొన్నాళ్ళకి వాళ్ళ వేధింపులు తాళలేక వాళ్ళని కలవడం మానేసింది ఆ యువతి. అందుకు ఆగ్రహించిన జార్జ్ వీడియోలని, ఫోటోలని తన ఫ్రెండ్స్ కి షేర్ చేశాడు. ఇక భరించలేక ఆ యువతి పోలీస్ కంప్లైంట్ ఇవ్వగా వారిని అరెస్టు చేసిన పోలీసులు వారి దగ్గర నుంచి ఫోన్లు లాప్టాప్ లు స్వాధీనం చేసుకున్నారు.

Related Articles

ట్రేండింగ్

YSRCP: జగన్ సభకు వెళ్లలేదని కుళాయి తొలగింపు.. వైసీపీ నేతలు తమ గొయ్యి తామే తవ్వుకుంటున్నారా?

YSRCP: వైసిపి నాయకులలో ఓడిపోతామనే భయం వారిని వెంటాడుతూ ఉంది. ఈ భయం కారణంగానే వైసిపి నాయకులు కార్యకర్తలు ఏం చేస్తున్నారనే విచక్షణ జ్ఞానాన్ని కూడా కోల్పోయి వ్యవహరిస్తున్నారు. ఇటీవల కుప్పంలో ముఖ్యమంత్రి...
- Advertisement -
- Advertisement -