Chandrababu Naidu: మహానాడులో చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాలు ఇవే!

Chandrababu Naidu: ఈ నెల ఆఖరిలో టీడీపీ పండుగ మహానాడు జరగనున్న సంగతి మనందరికీ తెలిసిందే. తరచుగా మహానాడును పార్టీ నాయకత్వం అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటుందన్న విషయం తెలిసిందే. కాకపోతే రాబోయే మహానాడు ఆర్భాటంగానే కాకుండా చాలా కీలకంగా కూడా వ్యవహరించబోతోందట. అయితే ఎందుకు ఇంత కీలకంగా మారబోతోంది? అంటే వచ్చే ఏడాది ఎన్నికలకు ముందు జరగబోతున్న భారీ కార్యక్రమం కావడంతో ఇది కీలకంగా మారునుందని తెలుస్తోంది. రాబోయే మహనాడు లోనే చంద్రబాబు నాయుడు కొన్ని కీలకమైన నిర్ణయాలను ప్రకటిస్తారని ప్రచారం జరుగుతోంది.

ఆ కీలకమైన అంశాలు ఏమిటంటే మొదటిది మేనిఫెస్టో ప్రకటన ఉంటుంది అంటున్నారు. అలాగే రెండవది పొత్తుల విషయం పైన నిర్ణయం ప్రకటిస్తారట. ఇక మూడవది అభ్యర్ధులను కూడా ప్రకటించబోతున్నట్లు సమాచారం. అదేవిధంగా చేరికలు కూడా ఎక్కువగానే ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అంటే ఈ నాలుగు అంశాలను బహిరంగంగానే ఉంటాయి కాబట్టే రాబోయే మహానాడు చాలా కీలకం కాబోతోంది. మామూలుగా అయితే పొత్తులపై నిర్ణయం, అభ్యర్ధుల ప్రకటనపైన మహానాడు లాంటి కార్యక్రమాల్లో ఎప్పుడు చర్చ ఉండదు. మ్యానిఫెస్టో, పార్టీలోకి చేరికల్లాంటి విషయాలను చర్చిస్తే చర్చిస్తారు.

 

మ్యానిఫెస్టోను కూడా డైరెక్టుగా ఎప్పుడూ మేనిఫెస్టో అని పేరుపెట్టి ప్రకటించింది లేదు. వివిధ అంశాలపై రాజకీయ తీర్మానాల రూపంలోనే ఫైనల్ చేస్తారు. ఆ తర్వాతే పాలిట్ బ్యూరోలో చర్చించి మ్యానిఫెస్టోను నిర్ణయిస్తారు. అలాంటిది రాబోయే మహానాడులోనే పై నాలుగు అంశాలు వేదిక మీద చర్చలు, నిర్ణయాలుంటాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అందుకే ఈ సారి మహానాడు కీలకంగా ఉండబోతోంది. కాగా బాబు తీసుకున్న నిర్ణయాల గురించి ప్రస్తుతం చర్చలు నడుస్తున్నాయి..

Related Articles

ట్రేండింగ్

Amala Akkineni-Jr NTR: ఎన్టీఆర్ విషయంలో అమల అంత పెద్ద తప్పు చేసిందా.. అభిమానులు ఎప్పటికీ క్షమించలేరా?

Amala Akkineni-Jr NTR: టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్...
- Advertisement -
- Advertisement -