Heroes: శ్రీరాముడి పాత్రలో నటించి ప్రాణం పోసిన ప్రముఖ నటులు వీళ్లే!

Heroes: దేశం అంతా రామనామ జపంతో ఉర్రూతలూగిపోతుంది. రామ నామ సంకీర్తనలతో ప్రతి ఊరు, ప్రతి రామాలయం ఎంతో సందడి నెలకొంది. రామ కథ మధురమైనది, రామచరిత అద్భుతమైనది రామచంద్రుడి జీవితం ఆదర్శప్రాయం ఇదే విషయాన్ని సినిమాల ద్వారా కూడా ప్రజలకు తెలియజేశారు ఎందరో మహానుభావులు. భారతీయ ఇతిహాసాలలో రామాయణం ఉన్నతమైనది. రామాయణం అనగానే ముందుగా అందరికీ శ్రీరామచంద్రుడే గుర్తుకు వస్తాడు. అలాంటి మహోన్నతమైన రాముడు పాత్రలో ఒదిగిపోయి ప్రజల హృదయాల్లో నిలిచిపోయిన నటులు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

 

1932లో తొలిసారిగా రామాయణాన్ని వెండితెర మీద చూపించారు. యడవల్లి సూర్యనారాయణ రాముడు పాత్రలో కనిపించారు. ఈయన రంగస్థలం కళాకారుడు అలాగే తొలి తరం తెలుగు సినీ నటుడు. ఆ తర్వాత చాలామంది రాముడు పాత్రలో నటించినా శ్రీరామచంద్రుడు అనగానే వెంటనే గుర్తొచ్చే నటుడు నందమూరి తారక రామారావు. శ్రీరామచంద్రుడి రూపు మరిచిపోయి అందరూ ఎన్టీఆర్ ని రాముడు గా భావించే దశకు ప్రేక్షకులను తీసుకువచ్చేశారు. ఈయన రాముడు పాత్రలు చేస్తుంటే స్వయంగా రాముడే దిగివచ్చినట్లు భావించిన ప్రజలు హారతులు దీపాలు, ధూపాలు సమర్పించుకునే వారట.అంతలా ఆ పాత్రలో జీవించేవారు నందమూరి తారకరామారావు.

ఆయన సంపూర్ణ రామాయణం, శ్రీరామ పట్టాభిషేకం, రామాంజనేయ యుద్ధం వంటి సినిమాలలో నటించారు. ఆ తర్వాత అంతటి పేరుని సంపాదించుకున్న నటుడు హరనాథ్ సీతారామ కళ్యాణం, శ్రీ రామ కథ సినిమాలలో రాముడిగా నటించి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడు. అక్కినేని నాగేశ్వరరావు సీతారామ జననం సినిమాలో రాముడిగా చేశారు అలాగే వీరాంజనేయ సినిమాలో కాంతారావు శ్రీరామచంద్రమూర్తిగా నటించారు. ఇక సంపూర్ణ రామాయణం లో శ్రీరాముడిగా శోభన్ బాబు నటన అజరామరం.

 

ఇక బాపు దర్శకత్వంలో వచ్చిన సీతా కళ్యాణం సినిమాలో శ్రీరాముడిగా నటించిన మలయాళ నటుడు రవి కూడా ప్రజలకు బాగానే చేరువయ్యాడు. అలాగే శ్రీరామదాసు సినిమాలో సుమన్, దేవుళ్ళు సినిమాలో శ్రీకాంత్, శ్రీరామరాజ్యం సినిమాలో నందమూరి బాలకృష్ణ, బాల రామాయణం సినిమాలో బాలరాముడుగా జూనియర్ ఎన్టీఆర్ వీరందరూ రాముడు పాత్రలు ధరించి వారి జన్మని ధన్యం చేసుకున్న వారే ఇక మొన్న మొన్న ఆది పురుష్ గా వచ్చిన ప్రభాస్ కూడా శ్రీరాముని పాత్ర ధరించి అందరినీ మెప్పించాడు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -