Vastu Doshas: వాస్తు దోషాలు తప్పించుకోవాలంటే చేయాల్సిన పనులు ఇవే!

Vastu Doshas: మన దైనందిన జీవితంలో ఉదయం లేచిన దగ్గరనుంచి రాత్రి పడుకునే వరకు తెలిసి తెలియక కొన్ని రకాల తప్పులను చేస్తూ ఉంటాము. మంచి పనులు కూడా చేస్తూ ఉంటాం. అయితే మనం చేసే కొన్ని పనుల వల్ల వాస్తు దోషం కలుగుతుందని మీకు తెలుసా? అవును ఇది నిజమే మనం చేసే కొన్ని పనుల వల్ల వాస్తు దోషం కలుగుతుందట. దాంతో మనం ఎటువంటి పని మొదలుపెట్టిన జరగకపోవడం. ఏది కలిసి రాకపోవడం లాంటివి జరుగుతాయి. మరి ఆ పనులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ప‌గిలిన వ‌స్తువుల్లో ఆహారం తిన‌రాదు.

 

కాఫీ, టీ, జ్యూస్ లేదా నీరు వంటి ద్ర‌వాల‌ను తాగకూడదు. అస‌లు ప‌గిలిన వ‌స్తువుల‌ను ఇంట్లో ఉంటే వెంట‌నే తీసేయడం మంచిది. దీంతో ల‌క్ క‌ల‌సి వ‌స్తుంది. లేదంటే దుర‌దృష్టం వెంటాడుతుంది. ఏదీ క‌ల‌సి రాదు. కారు లేదా బైక్ ఏవి ఉప‌యోగించినా చాలా మంది వాటిని తుడ‌వ‌కుండానే దుమ్ము, ధూళితో అలాగే వాటిని బ‌య‌ట‌కు తీసి వాటిపై వెళ్తారు. కానీ అలా చేయ‌కుండా వాహ‌నాల‌ను క్లీన్ గా తుడిచాకే వాటిల్లో ప్ర‌యాణించాలి. లేదంటే వాస్తు దోషం క‌లుగుతుంది. పిల్లలు సాధారణంగా ఉదయాన్నే నిద్ర లేవకపోవడంతో చాలామంది తల్లిదండ్రులు అరుస్తూ వారిని నిద్ర లేపుతూ ఉంటారు.

కానీ అలా చేయకూడదు. ముఖంపై చిరున‌వ్వుతో మృదువుగా మాట్లాడుతూ నిద్ర లేపాలి. దాంతో ఆ పిల్లలు ఆరోజు అంతా కూడా ఉత్సాహంగా సంతోషంగా ఉంటారు. అలాగే ఉద‌యాన్నే ఇంటి నుంచి బ‌య‌ల్దేరి ఎక్క‌డికి వెళ్లినా ఉత్త చేతుల‌తో వెళ్ల‌కూడ‌దు. క‌నీసం ఒక బాటిల్‌లో నీటిని అయినా వెంట తీసుకెళ్లాలి. దీంతో పాజిటివ్ ఎన‌ర్జీ ప్ర‌సార‌మ‌వుతుంది. చాలా మంది ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్ మానేసి నేరుగా మ‌ధ్యాహ్నం లంచ్ చేస్తారు. అలా చేయ‌కూడ‌దు. ఉద‌యాన్నే క‌చ్చితంగా బ్రేక్‌ఫాస్ట్ చేయాల్సిందే. దీంతో శ‌రీరం ఉత్తేజంగా మారుతుంది. పాజిటివ్ ఎన‌ర్జీ ప్ర‌సార‌మ‌వుతుంది. ఏ ప‌నినైనా చేసే శ‌క్తి వ‌స్తుంది. రోజంతా ఉత్సాహంగా ఉండ‌వ‌చ్చు. బ్రేక్‌ఫాస్ట్ చేసేంత టైమ్ లేక‌పోతే క‌నీసం పండ్ల‌ను అయినా తినాలి.

 

చాలా మంది తాము రోజూ వెంట తీసుకెళ్లే బ్యాగుల్లో వృథా పేప‌ర్లు, క‌వ‌ర్లు, ఇత‌ర వ‌స్తువులు పెడ‌తారు. అలా ఉంచ‌రాదు. బ్యాగును రోజూ ఎప్ప‌టిక‌ప్పుడు శుభ్రం చేసుకోవాలి. ఆఫీసుల్లో ప‌నిచేసే ఉద్యోగులు గ‌తం రోజు ఆఫీస్‌లో జ‌రిగిన సంఘ‌ట‌న‌ల‌ను మ‌రిచిపోవాలి. మ‌రుస‌టి రోజు ఉద‌యాన్నే ఆఫీస్‌లోకి ఎంట‌ర్ అయ్యేట‌ప్పుడు ఫ్రెష్‌గా ఉండాలి. తాజాగా ప‌ని ప్రారంభించాలి. దీంతో అదృష్టం క‌ల‌సి వ‌స్తుంది. అనుకున్న ప‌నులు నెర‌వేరుతాయి. ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్ చేసే వారు ఎట్టి ప‌రిస్థితిలోనూ ప్లేట్‌లో పెట్టుకున్న ఆహారాన్ని వ‌దిలిపెట్ట‌రాదు. మొత్తం తినేయాలి. 8 రకాల పనులు చేయడం వల్ల మనకు తెలియకుండానే వాస్తు దోషం వెంటాడుతుంది.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -